ఈనెల 23న పవన్ కళ్యాణ్ నామినేషన్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏప్రిల్ 23వ తారీకు నామినేషన్( Nomination ) దాఖలు చేస్తున్నట్లు.

పార్టీ మీడియా విభాగం ప్రకటన విడుదల చేసింది.అదే రోజు సాయంత్రం ఉప్పాడలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొంది.

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలైంది.ఏప్రిల్ 18 వ తారీకు మొదటి రోజే వివిధ పార్టీలనేతలు నామినేషన్స్ దాకాలు చేయడం జరిగింది.

ఏపీలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా ఉన్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది.

టీడీపీ.బీజేపీ.

జనసేన పార్టీలు( TDP BJP Janasena ) కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.

2014లో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి గెలవడం జరిగింది. """/" / ఇప్పుడు అదే రకంగా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తుంది.పరిస్థితి ఇలా ఉంటే 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు.

భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది.కానీ ఈసారి పిఠాపురం( Pithapuram ) నుండి పోటీ చేస్తున్నారు.

కచ్చితంగా గెలవాలని అహర్నిశలు కష్టపడుతున్నారు.ఆల్రెడీ అక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

కొద్దిరోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.పవన్ మాత్రమే కాకుండా ఆయన తరపున ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు కూడా.

జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఏప్రిల్ 23న పవన్ కళ్యాణ్ నామినేషన్స్ వేయబోతున్నారు.

రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్ పాత్రలో నటించిన హీరోలు ఎవరో మీకు తెలుసా?