ఫొటోటాక్ : పవన్ ఫ్యాన్స్ కు కన్నుల పండుగ
TeluguStop.com
పవన్ గత మూడు నెలలుగా దీక్షలో ఉన్న విషయం తెలిసిందే.దీక్ష కారణంగా పవన్ తన జుట్టు మరియు గడ్డము పెంచారు.
ఆ గడ్డం జుట్టులో ఆయన్ను చూడటానికి అభిమానులు సైతం కాస్త ఇబ్బంది పడుతున్నట్లు గా సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.
యాంటీ ఫ్యాన్స్ ఆయన గడ్డం లుక్ పోస్టర్స్ తో ఒక ఆట ఆడుకున్నారు అనడంలో సందేహం లేదు.
సోషల్ మీడియాలో ఆయన ఫోటోలను ట్రోల్ చేశారు.పవన్ కళ్యాణ్ రాజకీయాలను మరియు సినిమాలను వదిలేసి సన్యాసం తీసుకోబోతున్నారు అంటూ కూడా ఒకానొక సమయంలో కొందరు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నొచ్చుకున్నారు.
వాళ్ళకు తీవ్రంగా సమాధానం చెప్పినప్పటికీ పవన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తన పాత లుక్ లోకి వచ్చేశాడు.సింపుల్ గడ్డం మరియు జుట్టు తో యధావిధిగా పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు కనిపిస్తున్నాడు.
ఇదే సమయంలో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ కూడా ఫ్యాన్స్ కి అందుతోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెల రెండవ వారం నుండి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగులో జాయిన్ కాబోతున్నారట.
అందుకోసమే దీక్ష విరమించి ఇలా న్యూ లుక్ లోకి వచ్చి ఉంటారు అనే టాక్ కూడా వినిపిస్తుంది.
ఈ ఏడాది చివరి వరకు వకీల్ సాబ్ లో చేసి వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న విరూపాక్ష సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ కాబోతున్నాడు.
ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరియు సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడు.
మొత్తానికి వచ్చే ఏడాది రెండు లేదా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా పవన్ కళ్యాణ్ కష్ట పడబోతున్నాడు.
పవన్ కొత్త లుక్ తో ఫ్యాన్స్ కి కన్నుల పండుగగా ఉంది అని అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రానా ఇలాంటి సినిమాలు చేస్తే హీరోగా నిలదొక్కుకోలేడా..?