వరుస రీమేక్ లతో రెడీ అవుతున్న పవన్.. అసంతృప్తిలో ఫ్యాన్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇది బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ ఆధారంగా తెరకెక్కింది.పవన్ తన ఎంట్రీ ని రీమేక్ సినిమాతోనే స్టార్ట్ చేసాడు.

ఇక అప్పటి నుండి పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు.

వకీల్ సాబ్ సినిమా తర్వాత ఇటీవలే పవన్ భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.ఇందులో రానా కూడా ప్రధాన పాత్రలో నటించాడు.

ఇది కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా కు రీమేక్ గా తెరకెక్కింది.

ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు.

దీంతో పాటు మరొక రీమేక్ ను కూడా లైన్లో పెట్టాడు.ఇక్కడితో పవన్ రీమేక్ లను ఆపకుండా వరుస రీమేక్ లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ మూడు రీమేక్ సినిమాలపై కన్నేశారని ఈ మూడు సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నాడని ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.

"""/" / వినోదయ్యా సిత్రం అనే తమిళ రీమేక్ సినిమాను చేయనున్న పవన్ ఇప్పటికే ఈ రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.

ఈ రీమేక్ మాత్రమే కాకుండా ఇప్పుడు మరొక మూడు రీమేక్ సినిమాలు చేయాలనీ అనుకుంటున్నాడు అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది.

ఇలా పవన్ వరుసగా రీమేక్ సినిమాలనే చేయడం అభిమానుల్లో మాత్రం సంతృప్తిని ఇవ్వడం లేదు.

ఈయన వరుస రీమేక్ లు చేస్తూ ఒరిజినల్ సినిమాలు చేయక పోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ పై బాబు ఫోకస్.. రాజీనామా బాటలో మరికొంతమంది ?