జనసేన కౌలు రైతు భరోసాకు మెగా బ్రదర్స్ మాతృమూర్తి సాయం

అమరావతి: జనసేన కౌలు రైతు భరోసాకు మెగా బ్రదర్స్ మాతృమూర్తి సాయం.పెన్షన్ డబ్బుల నుంచి రూ.

లక్షన్నర విరాళం చెక్ ను కుమారుడు పవన్ కళ్యాణ్ కు అందచేసిన అంజనాదేవి.

పార్టీ కోసం మరో రూ.లక్ష విరాళం అందచేత.

కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా విరాళం.పవన్ కళ్యాణ్ కామెంట్స్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మా తండ్రి గారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు.

పెన్షన్ డబ్బులను ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి అమ్మ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.

ఆయన అబ్కారీ శాఖలో పనిచేసేవారు.ఆయనకు వచ్చిన జీతంతోనే మేమంతా పెరిగాం.

2007లో ఆయన కాలం చేశారు.అప్పటి నుంచి అమ్మకు పెన్షన్ రావడం మొదలయ్యింది.

పెన్షన్ డబ్బులను దాచి సహాయ కార్యక్రమాలకు ఇవ్వడం అమ్మకు అలవాటు.ఇవాళ కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి విరాళంగా ఇచ్చింది.

పెద్ద మనసుతో ఆమె చేసిన ఈ పనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలి.

అది మా ఫ్యామిలీకి భావోద్వేగంతో కూడుకున్నది.అందుకే సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.

ఉద్యోగులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

టెక్నీషియన్‌తో మహిళ అఫైర్.. గీజర్‌లో కెమెరా పెట్టి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడంటూ నాటకం.. చివరకు?