అమిత్ షాతో భేటీ అయిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అమిత్ షా కు వినతి పత్రం అందజేశారు.

ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అంత మాత్రమే గాక త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ -జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరడం జరిగిందట.

బీజేపీ- జనసేన కూటమిగా ఏర్పడి ఏడాది అయిన తర్వాత అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉంటే ఇదే విషయంపై ప్రధాని మోడీ తో భేటీ అవ్వాలని ప్రయత్నించిన ఈ క్రమంలో మోడీ అపాయింట్మెంట్ పవన్ కి దొరకలేదని టాక్.

 .

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి