నొప్పింపక తానోవ్వక అంటూ కానిచ్చేసిన పవన్?

అందరూ ఊహించినట్లే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మధ్యే మార్గం ఎన్నుకున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధుల తరఫున ఎన్నికల ప్రచారానికి పూనుకున్న పవన్ కళ్యాణ్ కూటమి ధర్మంలో భాగంగా కొంతమంది బిజెపి నేతలకు( BJP ) కూడా ప్రచారం చేస్తున్నారు.

అందులో భాగంగానే వరంగల్ లో బిజెపి అభ్యర్ధి రావు పద్మ( Rao Padma ) తరపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ తన తన స్పీచ్ ఆద్యంతం ఎక్కడా కూడా ఎక్కడా అధికార బీఆర్ఎస్ పై కానీ ప్రదాన ప్రతిపక్షం కాంగ్రెస్ పై గాని ఘాటు వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

అయితే తాను బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించడం లేదో కూడా పవన్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

బిఆర్ఎస్( BRS ) విమర్శించడానికి తనకు ఒక సమస్య ఉందని తెలంగాణ ఏర్పాటు కోసం వందల మంది యువకులు బలిదానం చేసినప్పుడు తెలంగాణలో తెలంగాణ( Telangana ) నుంచి పుట్టిన పార్టీలే ఉండాలని అనుకున్నాను అని, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉండే సామాజిక తెలంగాణను కోరుకున్నానని,అవినీతి లేకుండా ఉండాలని ఆశించానని అయితే ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయో మీకే తెలుసు అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.

"""/" / తద్వారా బిఆర్ఎస్ పై పవన్ విమర్శలు చేయడానికి భయపడుతున్నాడు అన్న విమర్శలకు పవన్ వైఖరి ఊతం ఇచ్చినట్లయ్యింది.

అయితే ఒక రకం గా చూస్తే పవన్ ది సరైన రాజకీయ విధానమేనని ,ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్లో తాము ఆశిస్తున్న పొత్తుకు ముందుకు రాని బిజెపి కోసం అంతో ఇంతో అనుకూలం గా ఉన్న బిఆర్ఎస్ ను దూరం చేసుకోవడం అంత తెలివైన ఎత్తుగడ కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ తామరాకు మీద నీటి బొట్టులా లౌఖ్యం గా వ్యవహరించాడే తప్ప ప్రత్యర్ధులకు భయపడి కాదని """/" / రాజకీయంగా 151 ఎమ్మెల్యేల తో బలం గా ఉన్న జగన్ ని( Jagan ) ఆ స్థాయిలో విమర్శించే పవన్ కేసీఆర్( KCR ) భయపడ్డాడు అనటం హాస్యాస్పదంగా ఉందంటూ జనసేన నేతలు చెప్పుకొస్తున్నారు.

పవన్ ప్రధమ ప్రాధాన్యత ప్రజా సంక్షేమానికే తప్ప రాజకీయ వ్యూహాలకు కాదని ప్రజల సర్వతో ముఖాభివృద్ధి జనసేన లక్ష్యం అంటూ ఆ నేతలు చెప్పుకొస్తున్నారు.

ఏదేమైనా తన శైలి కి భిన్నంగా పవన్ తెలంగాణలో వ్యవహరించాడాని మాత్రం చెప్పుకోవచ్చు.

సందీప్ రెడ్డి వంగ మీద వచ్చే వ్యతిరేకతకు ‘స్పిరిట్ ‘ తో చెక్ పెట్టబోతున్నాడా..?