అన్నయ్య అప్పుల తీర్చడానికి ఇష్టం లేకున్నా సినిమాలు చేసాను: నాగబాబు
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఒకరు.
ఈయన చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు.
ఇక ఈయన నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈ సినిమాలలో కూడా హిట్టు ఫ్లాపులు ఉన్నాయని చెప్పాలి.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం( AP Deputy CM ) గా కొనసాగుతున్న నేపథ్యంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.
అయితే ఈయన కమిట్ అయిన సినిమాలను వీలైనప్పుడు పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తుంది. """/" /
ఇక ఇటీవల కాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో పుట్టినరోజు వస్తుంది అంటే తప్పనిసరిగా వారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను తిరిగి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఈయన నటించిన గబ్బర్ సింగ్ ( Gabbar Singh ) సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2012 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
"""/" /
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాని తెరకెక్కించారు అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
తాజాగా సినిమాలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిజానికి పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేయడం ఏమాత్రం ఇష్టం లేదట.
కేవలం తన అన్నయ్య అప్పుల్లో ఉన్నారన్న ఉద్దేశంతోనే డబ్బు కోసమే ఈ సినిమా చేశారని ఓ సందర్భంలో నాగబాబు తెలిపారు.
నాగబాబు ( Nagababu ) ఆరెంజ్ సినిమా చేసిన తర్వాత భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నారు.
అయితే ఈ నష్టాలను తీర్చడం కోసమే పవన్ కళ్యాణ్ ఇష్టం లేకపోయిన సినిమాలు చేశారని నాగబాబు కూడా పలు సందర్భాలలో వెల్లడించారు.
అయితే తిరిగి ఈ సినిమాలు విడుదలవుతున్న తరుణంలో ఈ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
దంతాలపై పసుపు మరకలను పోగొట్టే బెస్ట్ హోమ్ రెమెడీస్ మీకోసం!