గ్రాండ్ వేలో వెళ్తున్న విశ్వక్ సేన్ కొత్త మూవీ.. పవర్ స్టార్ చేత లాంచ్!

యువ నటుడు విశ్వక్ సేన్ పాపులారిటీ గురించి చెప్పాల్సిన పని లేదు.ఈయన వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఇటీవలే ఈయన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడు.ఇక ఈ సినిమా తర్వాత ఈయన తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.

తన 11వ సినిమాను విశ్వక్ సేన్ ఈ రోజు లాంఛనంగా స్టార్ట్ చేసాడు.

ఈ సినిమాను ప్రముఖ నటుడు డైరెక్టర్ అయినా అర్జున్ సర్జా దర్శకత్వం వహించ నున్నాడు.

దీనికి సంబంధించి ఇటీవలే ప్రకటన వచ్చింది.ఇక ఈ రోజు ఈ సినిమాను గ్రాండ్ గా చేసారు.

అయితే ఈ లాంచింగ్ వేడుకకు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

దీంతో ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది. """/"/ ఈయన లాంచింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ హీరో హీరోయిన్ లపై క్లాప్ కొట్టారు.ఈ పూజా కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ తో పాటు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కూడా హాజరయ్యారు.

ఈ ఫోటోలు అన్ని కూడా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించనుంది.

"""/"/ అలాగే కీలక పాత్ర కోసం జగపతిబాబు ను తీసుకున్నారు.ఈ రోజు రామానాయుడు స్టూడియోలో విశ్వక్ సేన్, ఐశ్వర్య రాజేష్ పై తొలిషాట్ పవన్ కొట్టి టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇలా ఈ సినిమా స్టార్టింగ్ రోజే గ్రాండ్ వేలో వెళ్తుంది.మరి ఈ సినిమాను శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటెర్నేష్నల్ నిర్మిస్తుండగా కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.