బుకింగ్స్ లో జల్సాను మించిపోతున్న పవన్ 'ఖుషి'.. మరో సెన్సేషన్ ఖాయం!

తెలుగు వారి అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒక్కసారి ఏ హీరోకు అయినా ఫ్యాన్ అయినారంటే ఇక వారిని ఎంతగా అభిమానిస్తారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక తమ అభిమాన హీరో నటించిన చిత్రాల్లో క్లాసిక్ హిట్ గా నిలిచి పోయిన సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇటీవల ట్రెండ్ గా మారిపోయింది.

ఇటీవల కాలంలో హీరోల పుట్టిన రోజు నాడు స్పెషల్ గా షోలు వేస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లాసిక్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పోయిన మరో సినిమా రీరిలీజ్ చేస్తున్నారు.

2001లో వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం 'ఖుషి'.పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక చావ్లా హీరోయిన్ గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇన్నేళ్లకు మళ్ళీ రీ రిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా యుఫోరియా స్టార్ట్ అయ్యింది.

ఈ సినిమా డిసెంబర్ 31న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు.దీణ్హతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సెన్సేషన్ అయ్యేలా తమ వంతు కృషి చేస్తున్నారు.

ఇటీవలే పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం జల్సా సినిమా రీ రిలీజ్ చేసారు.

ఈ సినిమా ఏకంగా 2.85 కోట్ల వసూళ్లు అందుకుని రీ రిలీజ్ క్యాటగిరీలో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది.

మరి ఇప్పుడు జల్సా కంటే కూడా ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.

"""/"/ జల్సా రీ రిలీజ్ సమయంలో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి.మరి ఈ సినిమా కంటే కూడా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతున్న ఖుషి సినిమాకు ఎక్కువ బుకింగ్స్ నమోదు అవుతున్నట్టు టాక్ వస్తుంది.

ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ ని నమోదు చేసుకుంటుంది అని అంటున్నారు.

చూడాలి ఈసారి ఖుషి సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో.

టెక్నీషియన్‌తో మహిళ అఫైర్.. గీజర్‌లో కెమెరా పెట్టి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడంటూ నాటకం.. చివరకు?