‘వీరమల్లు’ షూట్ అప్డేట్.. ఇది ఎంత వరకు నిజం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చేస్తున్న సినిమాల్లో ''హరిహర వీరమల్లు'' ఒకటి.

క్రిష్ దర్శకత్వంలో ( Krish Jagarlamudi ) తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్ ఆసక్తి పోయేలా ఉన్నారు.

ఎందుకంటే ఈ సినిమా గత రెండేళ్ల క్రితం స్టార్ట్ అయ్యింది.ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది.

ఈ ప్రోజెక్టు పరిస్థితి అర్ధం కాకుండా ఉంది. """/"/ ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి.

మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.వారాహి యాత్ర( Varahi Yatra ) చేస్తూ బిజీగా ఉండడంతో కొద్దీ రోజులు ఆయన చేస్తున్న సినిమాల షూట్ వాయిదా వేశారు.

ఇక ఇప్పుడు ఈ టూర్ సక్సెస్ అవ్వడంతో సినిమాలు అన్ని పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు పక్కన పెట్టినట్టు టాక్ రాగా ఇది అబద్ధం అని తేలింది.

ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) షూట్ లో బిజీగా ఉన్నారు.

ఈ షెడ్యూల్ మొదలు పెట్టడంతో వీరమల్లు సినిమా డైలమాలో పడింది.ఈ సినిమా ఇక స్టార్ట్ చేస్తారా లేదా అని ప్రేక్షకులు కూడా అలోచించి విసిగి పోయారు.

మరి అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ లేకుండానే షూట్ చేస్తున్నారు అని తెలుస్తుంది.

ఆయన లేని షూట్ ను క్రిష్ తెరకెక్కిస్తున్నాడు అని తెలుస్తుంది. """/"/ ఇక ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం వీరమల్లు ( Hari Hara Veera Mallu ) షూట్ లో పవన్ కూడా పాల్గొనబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది.

పవన్ మధ్యలో కొద్దిగా గ్యాప్ చేసుకుని మరీ వీరమల్లుకు సమయం కేటాయించనున్నారని దీంతో కొంత మేర అయిన షూట్ పూర్తి అవుతుంది అని భావిస్తున్నారని సమాచారం.

మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.ఇదిలా ఉండగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal ) హీరోయిన్ గా నటిస్తుండగా.

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్ లో నటిస్తుంది.

చూడాలి అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎలాంటి హిట్ అందుకుంటుందో.

రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ ముగ్గురిలో గెలిచేది ఎవరు..?