పవన్ చంద్రబాబు భేటీ ! కీలక నిర్ణయం తీసుకుంటారా ?
TeluguStop.com
ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది.వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరికి వారు తమ వ్యూహాలను అమలు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
ప్రస్తుత అధికార పార్టీ వైసిపి( YCP ) వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి, గెలవాలనే పట్టుదలతో ఉండగా, టిడిపి, జనసేన, బిజెపిలు కూటమిగా వెళ్లి వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నాయి.
ఈ క్రమంలో పొత్తుల అంశం కీలకంగా మారింది.బిజెపి ,జనసేన ఇప్పటికే పొత్తులో ఉండగా , బిజెపి ఈ రెండు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తుంది.
అయితే బిజెపి అగ్ర నేతల నుంచి ఏ నిర్ణయం వెలువడకపోవడంతో , టిడిపి పవన్ పైనే ఆశలు పెట్టుకుంది.
ఎన్డీఏ( NDA ) సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వెళ్లారు.
"""/" /
ఈ సమావేశానికి చంద్రబాబుకు( Chandrababu Naidu ) ఆహ్వానం అందలేదు .
గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా పనిచేసిన చంద్రబాబును ఇప్పుడు ఆహ్వానించకపోవడంతో టిడిపితో పొత్తు బిజెపికి( BJP ) ఏమాత్రం ఇష్టం లేదనే విషయం అర్ధం అవుతుంది.
ఇది ఎలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు సమాచారం.
ఈ భేటీలో పొత్తుల అంశంపైనే ప్రధానంగా చర్చించబోతున్నారట.అలాగే సీట్ల సర్దుబాటు అంశం పైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బిజెపిని ఈ విషయంలో ఏవిధంగా ఒప్పించాలి అనే విషయం పైన ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇన్చార్జి మురళీధరన్ తో పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
"""/" /
ఆ సమావేశం అనంతరం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ప్రకటించారు.
ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబుతోను పవన్ సమావేశం అవుతుండడంతో, పొత్తుల విషయంలో ఏదో ఒక క్లారిటీ వస్తుందనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతుంది.
ఢిల్లీలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై( Volunteer System ) పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, దానిపై ప్రభుత్వ స్పందన వంటి విషయాల పైన వీరిద్దరూ చర్చించే అవకాశం ఉందట.
అలాగే వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్లడం, పవన్ పై కేసు విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు ఖండించడం వంటివి జరిగాయి.
టిడిపి తో పొత్తు విషయంలో బిజెపి అగ్రనేతలను ఒప్పించే బాధ్యతలు పవన్ తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ మేరకు త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలను కలిసి టిడిపితో పొత్తు అంశాన్ని మరోసారి ప్రస్తావించి వారిని ఒప్పించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారట.
ఇక పాత పాన్ కార్డులు పని చేయవా? కేంద్రం ఏం చెబుతోంది?