‘తమ్ముడు ‘ మళ్లీ త్యాగమూర్తేనా ? 

పవన్ కళ్యాణ్ ఈ పేరే ఒక ప్రభంజనంలా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.

వరుసగా పవన్ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనసైనికుల్లో సరికొత్త ఉత్సాహం పెంచుతూ, గతంతో పోలిస్తే జనసేన పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

పార్టీని అధికారంలోకి తీసుకురాగలము అనే నమ్మకం కూడా బాగా ఏర్పడింది.అందుకే పవన్ అన్ని మొహమాటాలను పక్కన పెట్టేసి, తన  సొంత సామాజిక వర్గమైన కాపులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళి మరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాపులు వెంట తాను ఉంటాను అంటూ భరోసా ఇచ్చారు.వైసిపికి రెడ్లు, టీడీపీకి కమ్మలు అండగా ఉండగా లేనిది, జనసేనకు కాపు సామాజిక వర్గం మద్దతు ఉంటే తప్పేంటి అన్నట్టుగా పవన్ ఇప్పుడు ఓపెన్ అయిపోయారు.

ఇదంతా త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల గురించే ఇక్కడ ఖచ్చితంగా జనసేన అభ్యర్థిని నిలబెట్టి గెలిచి తీరాలనే కసి పవన్ తో పాటు, జన సైనికుల్లోనూ ఉంది.

అయితే ఇక్కడే కొత్త చిక్కు వచ్చి పడింది.ఇదే తిరుపతి సీటు కోసం బీజేపీ గట్టిగానే కసరత్తు చేస్తోంది.

ఇక్కడ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.ఇప్పటికే తిరుపతి నుంచి బీజేపీనే పోటీ చేస్తుంది అనే విషయాన్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా సంకేతాలు ఇస్తూ వస్తోంది.

కొద్ది నెలల క్రితమే, ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన సహకారంతో బీజేపీ అభ్యర్థి తిరుపతి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని ప్రకటించి పెద్ద దుమారమే రేపారు.

ఆ తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తినా, అవి కాస్తా సర్దుమణిగిపోయాయి.

ఇప్పుడు బీజేపీ జనసేన కలిసికట్టుగా ముందుకు వెళుతున్నాయి.అయితే బీజేపీ మాత్రం దూకుడు పెంచింది.

తిరుపతి లో పోటీ చేయబోయేది తామే అనే సంకేతాలను జనసేనకు ఇస్తోంది.అలాగే రథయాత్ర కూడా తిరుపతి నుంచే మొదలు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

"""/"/ మళ్లీ జనసేన త్యాగం చేయాల్సిందే అనే సంకేతాలను బీజేపీ ఇస్తోంది.పోనీ జనసేన సొంతంగా పోటీ చేద్దామని చూసినా, తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన క్యాడర్ లేదు.

అయినా జనసేన మాత్రమే తిరుపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ క్యాడర్ గట్టిగానే పట్టుబడుతోంది.

ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన బిజెపి కోసం త్యాగం చేసిందని, ఇప్పుడు కూడా త్యాగం చేస్తే రాజకీయంగా అనేక విమర్శలు వస్తాయని, అందుకే తిరుపతిలో పోటీ చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు.

కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తుంటే , తిరుపతి సీటు లో బీజేపీ పోటీ చేసే విధంగానే పరిస్థితి కనిపిస్తోంది.

మళ్ళీ జనసేన త్యాగానికి సిద్ధపడుతున్నట్లు గానే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ టాలెంటెడ్ ఆర్టిస్టులు ఇన్నాళ్ల పాటు తక్కువగా అంచనా వేసామా ?