జనసేన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంగళవారం గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.పాత తరం రాజకీయాలకు కాలం చెల్లింది అంటూ జనసేన ఎమ్మెల్యేలకూ( Janasena MLA's )  స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

గతంలో మాదిరిగా కూర్చుని పవర్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కుదరదు.ప్రజలు మనకు ఎంత మద్దతు ఇచ్చారో వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు.

ఏదైనా సందర్భంలో వారు మాట అంటే భరించాలి.ఎవరిపైన వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అని పవన్ స్పష్టం చేశారు.

ఏపీ ఎన్నికలలో టీడీపీ కూటమి( TDP Alliance ) అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు.

"""/" / ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఎన్నికలకు ఏడాది ముందుగానే ప్రకటన చేశారు.

అదే సమయంలో వైసీపీ పార్టీని( YCP ) రెండోసారి గెలవనివ్వను అని వ్యాఖ్యానించారు.

టీడీపీ.బీజేపీ పార్టీలు కలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

ఆ తర్వాత కూటమిగా ఏర్పడి.ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఆ రకంగానే విజయాన్ని అందుకోవటం జరిగింది.పిఠాపురం నియోజకవర్గం నుండి 70 వేలకు పైగా మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలి.. ప్రముఖ నటి క్రేజీ కామెంట్స్ వైరల్!