క్రిష్‌కు మైండ్ బ్లాక్ చేసిన పవన్
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తరువాత నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం వేసవి కానుకగా రిలీజ్ అవుతుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.
అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా రిలీజ్ కాకుండా వాయిదా పడింది.
కేవలం కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోవడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని పవన్ అండ్ టీమ్ ఆతృతగా ఉన్నారు.
ఇక ఈ సినిమా పూర్తి కాకముందే పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేశాడు.
ఇప్పటికే దర్శకుడు క్రిష్‌తో ఓ సినిమా, దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమాను ఓకే చేసిన పవన్, ఈ సినిమాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే కరోనా కారణంగా వకీల్ సాబ్ కూడా పూర్తి కాకపోవడంతో, తన సినిమాలో పవన్ ఇప్పట్లో జాయిన్ కాలేడని దర్శకుడు క్రిష్ అనుకున్నాడు.
ఇదే తరుణంలో ఆయన మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఓ సినిమాను ప్రారంభించాడు కూడా.
అయితే ఇటీవల సినిమా షూటింగ్‌లు ప్రారంభం కావడంతో పవన్ కూడా తన సినిమాలను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని చూస్తున్నాడు.
ఈ తరుణంలోనే నవంబర్ చివరినాటికి వకీల్ సాబ్ చిత్ర బ్యాలెన్స్ పోర్షన్‌ను కంప్లీట్ చేసేయాలని పవన్ భావిస్తున్నాడు.
అటుపై వెంటనే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో రాబోయే సినిమాను ప్రారంభించేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇది క్రిష్ ఊహించని పరిణామమని చెప్పాలి.ఎప్పుడో మార్చి, ఏప్రిల్‌లో పవన్ తన సినిమాలో జాయిన్ అవుతాడని భావించిన క్రిష్‌కు పవన్ ప్లాన్ మైండ్ బ్లాక్ చేసిందని చెప్పాలి.
మరి ఈ విషయంపై క్రిష్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తాడో చూడాలి అంటున్నారు పవన్ ఫ్యాన్స్.
ఇక క్రిష్ డైరెక్షన్‌లో రాబోయే సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.
తర్వాత చేసే సినిమాల మీద లైట్ తీసుకుంటున్న అల్లు అర్జున్…