పవన్ ఆ పని చేసి ఉంటే ఇప్పుడు మరోలా ఉండేవాడు..

పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు చాలా తక్కువే అయినా అభిమానులను మాత్రం లెక్కకు మించి సంపాదించుకున్నాడు.

తన మేనరిజంతో తెలుగు జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు.

తన అన్న మెగాస్టార్ చిరంజీవి అండతో తెలుగు సినిమా పరిశ్రమలో పీకే అడుగు పెట్టినా అతి తక్కువ కాలంలోనే తన సత్తా చాటుకున్నాడు.

తన కెరీర్ లో మంచి పేరు తీసుకొచ్చిన సినిమా జాని.రేణుదేశాయ్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాకు స్వయంగా పవన్ కల్యాణ్ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా కథా రచయిత కూడా తనే కావడం విశేషం.అంతేకాద ఈ సినిమా విషయంలో పీకే ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు ఆయన పరిస్థితి మరోలా ఉండేది.

ఇంతకీ తను ఏం చేయాల్సి ఉండేది ఏం చేయలేద అనే విషయాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

"""/"/ టాలీవుడ్ లో అత్యధిక ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ జాని.

సుమారు రూ.24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా.

ప్రపంచ వ్యాప్తంగా 250 ప్రింట్లతో విడుదల అయిన తొలి తెలుగు సినిమాగా కూడా జాని రికార్డు కొట్టింది.

ఈ సినిమాకు రమణ గోకుల ఇచ్చిన సంగీంత సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది అని చెప్పుకోవచ్చు.

"""/"/ ఈ సినిమాకు సంబంధించి 6 లాక్స్ కు పైగా ఆడియో క్యాసెట్లు అమ్ముడు పోవడం విశేషం ఈ సినిమాకు గాను వపన్ కల్యాన్ రూ.

2.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

ఈ విషయాన్ని పీకే స్వయంగా చెప్పాడు.ఆ డబ్బుతో మాదాపూర్ లో ఓ 30 ఎకరాల భూమికొంటే ఇప్పుడు తనకు వేల కోట్ల రూపాయలు ఉండేవని చెప్పుకొచ్చాడు.

ఆ రోజుల్లోనే పెద్దగా ఆడని జాని సినిమాకు అంత రెమ్యునరేషన్ తీసుకుని పవన్ సంచలనం కలిగించాడు.

ఈ సినిమా విడుదలై 18 ఏండ్లు పూర్తి చేసుకోవడం విశేషం.

CMR: గర్ల్స్ హాస్టల్‌లో రహస్యంగా 300 వీడియోలు రికార్డ్?