పవర్ ‘ స్టార్ ‘ దశ తిరగబోతోందిగా ?

పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనుకున్న మేరకు సక్సెస్ కాలేకపోయారు.

దీనికి చాలామంది నాయకుల వెన్నుపోటే కారణం అనేది చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.

తన అన్న మంచితనం రాజకీయాల్లో పనిచేయలేదు అనేది పవన్ అభిప్రాయం.ఆ తర్వాత జనసేన పార్టీ తరపున రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు.

టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు.2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో కి జనసేన ను తీసుకుని వెళ్లినా, పెద్ద ఉపయోగం కనిపించలేదు.

అప్పటి నుంచి రాజకీయ వైరాగ్యంలో ఉంటూ వస్తున్నారు.ఈ క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో జనసేన పార్టీ పరిస్థితి మెరుగవుతుందని అంతా అంచనా వేసినా, బీజేపీ పవన్ విషయంలో పెద్దగా పట్టించుకొనట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది.

కానీ ఇప్పుడిప్పుడే పవన్ కు ఉన్న బలం ఏమిటో బీజేపీకి బాగా అర్థమైంది.

పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు చేసిన హడావుడి దేశవ్యాప్తంగా మార్మోగింది.అంతకుముందు పవన్ అభిమానులు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం, ప్రజల్లో ఈ విషయంపై చర్చ జరగడం, పవన్ కు మరింతగా క్రేజ్ పెరగడం, ఇవన్నీ బిజెపిని ఆలోచనలో పడేశాయి.

"""/"/ పవన్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సైతం పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించినట్టు తెలుస్తోంది.

ఇక సోము వీర్రాజు సైతం పవన్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం , పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో ఆయన ఉండడం ఇవన్నీ పవన్ కు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.

పవన్ సైతం గతం కంటే రాజకీయ పరిపక్వత కనబరుస్తున్నారు.ప్రతి విషయంలో క్లారిటీ గా ఉంటున్నారు.

గతంలో మాదిరిగా ఎక్కడా హడావుడి చేయకుండా, సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు.

బీజేపీతో సఖ్యతగా ఉంటూనే, ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకుంటూ, పవన్ వ్యవహరిస్తున్న తీరు బీజేపీ అధిష్టానం పెద్దలకు నచ్చడంతో పవన్ పై సానుకూల దృక్పథంతో ఉన్నారు.

"""/"/ ఇది పవన్ కు బాగా కలిసి వచ్చే అంశం.ముఖ్యంగా పవన్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా జరిగిన హడావుడిపై బిజెపి ప్రత్యేకంగా ఆరా తీసినట్లు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చరిత్ర.

పవన్ కు అభిమానులు సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉన్నా, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో పవన్ కన్ఫ్యూజ్ అవుతుండడంతోనే ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని బిజెపి పెద్దలు అంచనా వేస్తున్నారు.

పవన్ ను సక్రమంగా వాడుకుంటే ఏపీలో జనసేన బీజేపీ కూటమికి అధికారం దక్కడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం బిజెపి అగ్ర నాయకులలో సైతం వచ్చిందట.

అందుకే రానున్న రోజుల్లో పవన్ ప్రాధాన్యత మరింత పెరిగేలా చేయడంతోపాటు, ఆయనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రీల్స్ కోసం విమానాలను కూడా వదిలిపెట్టని ఆడవాళ్లు.. ఫ్లైట్‌లో డ్యాన్స్ చూస్తే..??