పవన్ గురి స్పష్టంగానే ఉందా?
TeluguStop.com
2014లో భారీ లక్ష్యాలతో జనసేనను ప్రకటించిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తెలుగు రాష్ట్రాల యువతలో భారీ ఆశలు రేపారు.
ప్రజారాజ్యం అనుభవాల తర్వాత కూడా తాను బలంగా ప్రజల కోసమే నిలబడాలని నిర్ణయించుకున్నానని ,తక్షణ రాజకీయ అధికారం కోసం కాకుండా సుదీర్ఘ రాజకీయ లక్ష్యంతో రాజకీయ పార్టీ పెట్టానని పవన్ తన ఆవిర్భావ సభ రోజు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కచ్చితంగా జనసేన 2014 ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని చాలామంది అంచనా వేశారు.
అయితే వెంటనే యూ-టర్న్ తీసుకున్న జనసేనా ని తాము ఎన్నికలలో పోటీ చేయడం లేదని తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలకు( BJP ) షరతులు లేని మద్దతుఇస్తున్నామని ప్రకటించడంతో ఒకసారిగా పవన్ను అభిమానించే వారిలో గందరగోళం చెల్లరేగింది.
పవన్ కు రాజకీయ నిలకడ లేదని, స్థిరత్వం లేదని , రాజకీయాలకు సరిపడరంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలు పవను విమర్శించాయి.
అయితే తాను సుదీర్ఘ రాజకీయ లక్ష్యానికి కట్టుబడి ఉన్నానన్న ప్రకటనకు తగ్గట్లుగానే ఆయన ప్రయాణం కొనసాగింది.
2019లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన పూర్తిస్థాయిలో ఫెయిల్ అయినప్పటికీ ఆ ప్రభావం పార్టీపై పడకుండా ఇంతకాలం పార్టీని తన కష్టార్జితంతో నడుపుతున్న పవన్ తాను రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని కొన్ని వర్గాలను నమ్మించగలిగారు.
దాంతో జనసేన నేడు అనూహ్య రీతిలో పుంజుకొని కొన్ని నియోజకవర్గాలలో గట్టి పోటీ ఇచ్చే స్థానానికి ఎదిగింది.
2019 కి 2024 జనసేన ప్రభావం చాలా స్పష్టంగా రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తుందని చెప్పవచ్చు .
"""/"/
అయితే 2024 లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని, కర్ణాటకలో ఒకప్పటి కుమారస్వామి పార్టీలా జనసేన కూడా తమ మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పడని పరిస్థితి తీసుకొస్తుందని అప్పుడు ఖచ్చితంగా పవన్ ను ముఖ్యమంత్రి( Pawan Kalyan CM ) చేయాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి వస్తుందని చాలామంది జనసైనికులు అంచనా వేశారు.
అయితే మరోసారి ఏటువంటి షరతులు లేకుండా తెలుగుదేశంతో పొత్తుకు వెళ్తున్నామని పవన్ ప్రకటించడంతో తామెప్పుడూ అధికారానికి దూరంగా ఉండిపోవాల్సిందేనా అన్న ఆవేదన జన సైనికుల లోనూ , నాయకుల లోనూ కనిపించింది .
అయితే వాటన్నిటికీ తన మంగళగిరి సభలో పవన్ క్లారిటీ ఇచ్చారు.తనకు స్పష్టమైన రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని, జనసేన కచ్చితంగా రాజకీయ అధికార సాధిస్తుందంటూ కుండబద్దలు కొట్టారు.
జరుగుతున్న పరిణామాలను వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకొని ముందుకు వెళ్లాలని , అస్పష్టమైన లక్ష్యాలు ఉండకూడదు అంటూ ఒక పిట్టకథ చెప్పి మరీ జనసైనికులను( Janasena Leaders ) ఒప్పించే ప్రయత్నం చేశారు.
తాను ఎప్పుడూ తన వెనక మనుషులు ఉన్నారనే, ఉంటారనే ఆలోచనతో నిర్ణయాలు తీసుకోనని , దేశం కోసం అంకితమైపోవడానికి కొన్ని దశాబ్దాల క్రితమే నిర్ణయించుకున్న మనిషినని , ఈరోజు ఈ స్తాయికి పార్టీని తీసుకువచ్చిన నాకు ఎలా ముందుకు తీసుకెళ్లాలో కచ్చితంగా తెలుసని జన సైనికులకు స్పష్టమైన సంకేతాలను ఇచ్చే ప్రయత్నం చేశారు.
"""/"/ దాంతో పొత్తు ప్రకటనపై వైసీపీ( YCP Leaders ) చేస్తున్న విమర్శలకు అయోమయంలో పడిన క్యాడర్కు భరోసా నింపే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తుంది.
పవన్ .బలమైన నియంత ని ఎదిరించాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కలిసి నడవడమే మంచిదన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం తప్ప తాము రాజకీయ అధికారం విషయంలో రాజీ పడేది లేదని స్పష్టమైన సంకేతాలను ఆయన తన కేడర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది
.
బరువు తగ్గాలని భావించేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!