పవన్ కళ్యాణ్ కు తన మొదటి సినిమాని గుర్తు చేస్తే చచ్చేంత కోపం ఎందుకు వస్తుందో తెలుసా...?

ఏ హీరో అయినా తన మొదటి సినిమా ఎంతో ప్రత్యేకమని చెప్పుకుంటాడు.చిరంజీవి తనకు పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు చాలా ప్రత్యేకమైనవని ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

ఆయన ఒక్కరికే కాదు అల్లు అర్జున్ కి గంగోత్రి, రామ్ చరణ్ కి చిరుత, వరుణ్ తేజ్ కి ముకుంద.

ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి నటుడికీ తన మొదటి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమైనది గానే ఉంటుంది.

కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్ద తన మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' పేరు ఎత్తితే బాగా కోపోద్రిక్తులవుతారు.

ఎందుకంటే ఈ సినిమాకి ముందుగా ఆయన జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఈ సినిమా పేరు వినగానే ఆయనకు తన జీవితంలో జరిగిన ఎన్నో ఘోరమైన ఘటనలు గుర్తుకొస్తాయి.

ముఖ్యంగా తాను ఇంటి నుంచి పారిపోయిన విషయం పవన్ కళ్యాణ్ ని బాగా ఇబ్బంది పెడుతుంది.

అందుకే ఆయన తన మొదటి సినిమా గురించి ఆలోచించడం పూర్తిగా మానేశారు.ఇంతకీ ఈ సినిమాకి ముందు ఏం జరిగింది? ఆయన ఎందుకు ఇంట్లో నుంచి పారిపోవలసి వచ్చింది? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2వ తేదీన జన్మించారు.పవన్ కల్యాణ్ తల్లిదండ్రులు పాలకొల్లు, నరసాపురం నగరాలకు చెందిన వారైనా.

ఆయన మాత్రం నెల్లూరులోనే ఎక్కువ కాలం గడిపారు.నెల్లూరు లోని ప్రముఖ కళాశాల బిఆర్ లో ఆయన ఇంటర్ చదివారు కానీ ఫెయిలయ్యారు.

ఎక్కువగా ఆధ్యాత్మికత జీవితాన్ని ఇష్టపడే పవన్ కళ్యాణ్ ఏదో తెలుసుకోవాలనే ఆలోచనలో ఉండేవారు.

పాఠ్య పుస్తకాల కంటే మించిన జ్ఞానాన్ని సంపాదించాలని ఆయన అనుకునేవారు.ఇంటర్ లో ఫెయిల్ అవ్వడంతో ఆయన చదువు మానేసి మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగులు వేసి బ్లాక్ బెల్ట్ సాధించారు.

అలాగే కళ్యాణ్ బాబు పేరు ని పవన్ కళ్యాణ్ గా ఆయన మార్చుకున్నారు.

"""/"/ అయితే తన జీవితంలో ఏం సాధించాలో తెలియని పవన్.ఏ రంగం వైపు వెళ్లాలి? అసలేం ఏం చేయాలి? అనే విషయంపై బాగా ఆలోచించి చివరకు బౌద్ధమతంలో చేరిపోవాలని దృఢంగా నిశ్చయించుకున్నారు.

కానీ తమ్ముడు సన్యాసి అవుతాడేమోనని చిరంజీవి బాగా భయపడి పోయే వారు.పవన్ కళ్యాణ్ చేత ఏదో ఒక సినిమా చేయించి సినిమా మాయలో పడేయాలనే చిరంజీవి అనుకునే వారు కానీ పవన్ కి తగ్గ సినిమా కథ దొరకలేదు.

అయితే ఇక తనకు సినిమాలు కూడా సూట్ అవ్వవని పవన్ కళ్యాణ్ భావించి బౌద్ధ మతం లోకి చేరడానికి ఇంటి నుంచి పారిపోయి బెంగళూర్ కి చేరారు.

ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయ్యింది.చిరంజీవి, నాగబాబు కలిసి వెంటనే బెంగళూరు కి వెళ్లి పవన్ కళ్యాణ్ ని వెతికి పట్టుకొని చెన్నై కి తీసుకొచ్చారు.

ఆ తర్వాత డైరెక్టర్ ఈ.వి.

వి సత్యనారాయణ ని పిలిచి పవన్ కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను కట్టబెట్టారు.

దీనితో ఆయన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ని వెండి తెరకు హీరోగా పరిచయం చేశారు.

అయితే "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమా పేరు వింటే ఆ సినిమాకి ముందు జరిగిన తతంగమంతా తనకు గుర్తుకు వస్తుందని పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమాని పూర్తిగా మర్చిపోయారు.

బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి .. ఎవరీ క్రిష్ రావల్?