పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారు.. ఈసీకి ఫిర్యాదు 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.

తమను ఎన్నికల్లో పోటీ చేయవద్దని పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారంటూ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్( Sheikh Jalil ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

బకెట్ గుర్తు ఉన్న నవరంగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ పవన్ బెదిరిస్తున్నట్లుగా జలీల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

  వెంటనే పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని షేక్ జలీల్ ఎన్నికల అధికారులను కోరారు .

ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన జలీల్ , జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్,  మచిలీపట్నం ఎంపీ బాలసౌరి, పవన్ పైన విమర్శలు చేశారు.

"""/" / ఈ ముగ్గురి పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని,  ఏపీ ఎన్నికలలో బకెట్ గుర్తు( Bucket Symbol In AP Elections ) ఉన్న నా పార్టీని పోటీ చేయవద్దని పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారని జలీల్ పేర్కొన్నారు.

మచిలీపట్నం ఎంపీ బాలసౌరి నాపై గన్ పెట్టి బెదిరించారని , హత్యా ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ఏపీలో ఈసీ నా పార్టీకి బకెట్ గుర్తు  కేటాయించింది.జనసేన గాజు గ్లాసు గుర్తు నా పార్టీ బకెట్ గుర్తు ఒకేలా ఉంటుంది అందుకే నా పార్టీ పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారు.

  ఐదు కోట్లు ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడు.అయినా వారి ప్రలోభాలకు లొంగలేదు.

మేము లక్ష్మీనారాయణ ( Lakshminarayana )నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ గా పోటీ చేస్తున్నాం అని షేక్ జలీల్ పేర్కొన్నారు.

తనను బెదిరించిన పవన్ కళ్యాణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ షేక్ జలీల్ డిమాండ్ చేశారు.

"""/" / ఇప్పటికే ఏపీలో గాజు గ్లాసు ( Glass In AP )ఫ్రీ సింబల్ అంటూ ఎన్నికల కమిషన్ గెజిట్ విడుదల చేయడంపై  పెద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ వ్యవహారం అలా ఉండగానే ఇప్పుడు నవరంగ్ పార్టీ రూపంలో బకెట్ సింబల్ జనసేనకు ఇబ్బందికరంగా మారింది .

నీళ్ల బకెట్ కూడా గాజు గ్లాస్ సింబల్ ను పోలి ఉండడంతో,  జనసేనకు పడాల్సిన ఓట్లు పొరపాటున బకెట్ సింబల్ పై పడే అవకాశం ఉందని జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి.

ప్రస్తుతం షేక్ జలీల్ ఎన్నికల సంఘానికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో , ఎన్నికల సంఘం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది.

వీడియో: మెరుపు వేగంతో ఢీ కొట్టిన కారు.. గాల్లో ఎగిరిపోయిన స్టూడెంట్..