పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా సెట్ చేయబోతున్న స్టార్ ప్రొడ్యూసర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే ఆయన వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూటు మార్చబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మూడు నెలల తర్వాత షూటింగ్ లో పాల్గొనబోతున్న పవన్ కళ్యాణ్ వరుసగా కమిట్ అయిన సినిమాలని పూర్తి చేసి మరో కొత్త సినిమాకు కూడా కమిట్ అవబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

"""/" / ఇక త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉందట.

ఇంతకుముందు హారిక హాసిని క్రియేషన్స్ వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ తీసుకున్నాడట.

ఇక దానికి సంబంధించిన ఒక సినిమా కూడా బ్యాలెన్స్ ఉండడంతో ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తానని కమిట్ అయ్యాడట.

ఇక ఆ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ లోనే ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి.

మరి ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లుఅర్జున్( Alluarjun ) తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

మరి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

"""/" / అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీసిన కూడా చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ అయిపోయే విధంగా ప్రణాళికను రూపొందించి ఒక మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించాలని చూస్తున్నాడట.

ఒకవేళ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే ఆ సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుందని ఒకవేళ ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వకపోతే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ డైరెకక్షన్ లో సినిమా చేయబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

చూడాలి మరి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో లో సినిమా ఉంటుందా లేదా అనేది.

డెలివరీ సర్వీస్ జెప్టోలో ఒక రోజు పని చేసిన హైదరాబాద్ యువకుడు.. ఎర్నింగ్స్ ఇవే..?