తన స్తాయి నిరూపించుకుంటున్న పవన్ కళ్యాణ్!
TeluguStop.com
నిజానికి ఒక రాజకీయ నాయకుడి స్థాయి ఆ రాజకీయ పార్టీ సాధించిన విజయాలను బట్టి ,ఓట్ల శాతాలను బట్టి, సీట్ల సంఖ్య ను బట్టి పెరుగుతూ ఉంటుంది.
అట్లా గల్లీ స్థాయి నాయకులుగా మొదలుపెట్టి జాతీయ స్థాయి నాయకులుగా సుదీర్ఘ ప్రయాణం చేసి నాయకులు పేరు గడిస్తారు.
అయితే గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ నుంచి ఫిరాయించినా కూడా పవన్ కళ్యాణ్ తనదైన స్ట్రేచర్ ను రాజకీయ పార్టీల నుంచి దక్కించుకుంటున్నారనే చెప్పాలి.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గాని నేడు బిజెపి గానీ పవన్ కు ఇస్తున్న ప్రయారిటీ, గౌరవ మర్యాదలు చూస్తుంటే పవన్ దేశ రాజకీయాల్లోకి ప్రత్యేకమైన నాయకుడిగా పవన్ పేరు తెచ్చుకున్నారనే చెప్పాలి .
అయితే దీని వెనక తక్షణ రాజకీయ ప్రయోజనాలో లేక సినిమా హీరోగా తెచ్చుకున్న భారీ స్టార్ డం కన్నా రాజకీయాల్లో ప్రజా సంక్షేమానికి, నైతిక విలువలకు ప్రధమ వైఖరే దీనికి ప్రధాన కారణంగా చెప్పాలి.
"""/" / ముఖ్యంగా 2014 ఎన్నికల సమయంలో అట్టహాసంగా పార్టీని ప్రకటించి భారీ స్థాయిలో స్పందన తెచ్చుకున్నా కూడా మోడీ ( Narendra Modi )లాంటి దార్శనికుడు దేశ ప్రధానిగా ఉండాలనే కోరికతో నిస్వార్ధంగా భేషరుతు మద్దతు ఇచ్చిన పవన్ పట్ల బీజేపీ అధిష్టానం ఏ స్థాయి మర్యాద చూపుతుందో మొన్న ఎల్బీనగర్ వేదికగా జరిగిన బీసీ ఆత్మ గౌరవ సభ నిరూపించింది.
ప్రతి ఎన్నికకు వందల సమీకరణాలు లెక్కలు కట్టుకునే బిజెపి పార్టీ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన జనసేనతో తెలంగాణలో పొత్తు పెట్టుకోగలిగిందంటే ప్రాంతాలకతీతంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ను తెలుగు ప్రజలకు గుర్తిస్తున్నారు అనే అంచనాకు భాజపా వచ్చినట్లే భావించాలి.
"""/" / నా వెనుక పవన్ ( Pawan Kalyan )ఉన్నారని దేశ ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడాడు అంటే అది ఖచ్చితంగా పవన్ స్థాయిని పెంచే వ్యాఖ్యలనే చెప్పాలి.
తద్వారా తెలుగు రాజకీయాల్లో పవన్ కేంద్రంగానే భవిష్యత్తు రాజకీయాలు ఉండబోతున్నాయి అన్న అంచనాలు పెరుగుతున్నాయి.
మరోపక్క భారీ ఆర్థిక వనరులు, సామాజిక మద్దతు ఉన్న వైసిపి, తెలుగుదేశం పార్టీలు చేయలేని పనిని పవన్ చేసి చూపించారు.
తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తున్న ఏకైక పార్టీకి జనసేన గుర్తింపు తెచ్చుకుంది.
ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకున్నా రెండు అసెంబ్లీలలోను ప్రాతినిధ్యం ఉన్న ఏకైక పార్టీగా జనసేన గుర్తింపు పొందుతుంది .
తద్వారా ప్రాంతాలుగా విడిపోయినా జనసేనకు రెండు రాష్ట్రాలలోనూ తనదైన రాజకీయం చేయగలిగే అవకాశం వస్తుంది .
ఇది ప్రజాసంక్షేమమే పరమావధిగా భావించి నిర్ణయాలు తీసుకోవడం వల్లే నేడు పవన్ కు ఈ స్తాయి గౌరవం , మర్యాద దక్కుతున్నాయి అన్నది జనసేన వర్గాలు వాఖ్యనిస్తున్నాయి .
ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ .. ఆ పదవుల భర్తీపై రానున్న క్లారిటీ