రీమేక్‌లతో పవన్‌ దారి తప్పుతున్నారా? ఇదంతా తప్పకే చేస్తున్నారా?

ఓవైపు పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్న పవన్‌ కళ్యాణ్‌.మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉంటున్నాడు.

ఏపీలో ఇటీవల జోరు పెంచిన పవన్‌.తాజాగా ఎన్నికలకు సిద్ధం అంటూ వారాహి వాహనం కూడా చూపించాడు.

ఇది అభిమానుల్లో జోష్‌ పెంచేలా చేసింది.అయితే, దీనిపై అటు వైసీపీ వారు రంగు రాజకీయం చేస్తున్నారు.

మిలటరీ వారు వినియోగించే రంగును పవన్‌ వాహనానికి వేశారని, ఇది నిషిద్ధ కలర్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై జనసైనికులు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఇక ఎన్నికలు ఏడాదిన్నరలో రాబోతున్నాయి.

ఈ క్రమంలో పొలిటికల్‌గా కాస్త ఎక్కువ సమయం పవన్‌ ఏపీలో గడపాల్సి ఉంటుంది.

ఈ తరుణంలో ఎన్నికల ఖర్చు కోసమైనా సినిమాలు చేయక తప్పని పరిస్థితి ఉంది.

అయితే కొత్త కథలపై వెళ్లకుండా పవన్‌ ప్రస్తుతానికి సేఫ్‌ జోన్‌ చూసుకుంటున్నారని చెబుతున్నారు.

ఇందులో భాగమే తేరీ రీమేక్‌ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.దీంతోపాటు భవగీయుడు భగత్‌సింగ్‌ చిత్రం ద్వారా మంచి విజువల్‌ ఎఫెక్ట్‌ ఉన్న మూవీని ప్రేక్షకులకు అందించాలని పవన్‌ భావిస్తున్నారు.

అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు రీమేక్‌లు ఓ రెండు మూడు త్వరగా కంప్లీట్‌ చేస్తే బెటర్‌ అనే అభిప్రాయంలో పవన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం ప్రత్యేకంగా ప్రయోగాలుచేయాల్సిన అవసరం కూడా ఉండదు.స్క్రిప్ట్‌ వర్క్‌లో కాస్త మార్పులు అంటే నేటివిటీకి తగ్గట్లు మార్చుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

"""/"/ వేగంగా పూర్తయ్యే వాటికే ఫస్ట్‌ ప్రయారిటీ.ఇలా గ్యారెంటీ సినిమాలు చేయడం వల్ల బడ్జెట్‌తోపాటు హిట్‌ కూడా కన్ఫంగా వస్తుంది కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారని అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో వకీల్‌ సాబ్‌ కావచ్చు.భీమ్లా నాయక్‌ కావచ్చు.

హిట్‌ కొట్టి రుజువయ్యాయి.ఈ క్రమంలో పవన్‌ తీసుకొనే నిర్ణయాలు పూర్తిగా తప్పనిసరి పరిస్థితుల్లోనే అంటున్నారు అభిమానులు.

ఏ కథ చేసినా కనీసం వంద కోట్లకుపైగా మార్కెట్‌ లభిస్తున్న నేపథ్యంలో వేగంగా పూర్తయ్యే ప్రాజెక్టులకే మొదటి ప్రయారిటీ ఇస్తున్నారు పవన్‌.

Chandini Chowdary : గెస్ట్ హౌస్ కు రాకపోతే ఫోటోలు మార్ఫ్ చేస్తామని చాందిని చౌదరికి బెదిరింపులు.. చివరకు?