పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని రీమేక్ చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో!

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ కచ్చితంగా ఉంటుంది.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో తొలిసారి 'జల్సా' అనే చిత్రం వచ్చింది.అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో కొన్నాళ్ళకు 'అత్తారింటికి దారేది' సినిమా తెరకెక్కింది.

ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఇలా వరుసగా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడం తో అభిమానులు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా 'అజ్ఞాతవాసి' ( Agnyaathavaasi Movie )పై ఆకాశమంత అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఇప్పటికీ ఒక పీడకల అనే చెప్పొచ్చు.

"""/" / అలాంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని అభిమానులే మళ్ళీ చూడాలని అనుకోరు కానీ, ఒక బాలీవుడ్ హీరో మాత్రం ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని చూస్తున్నాడట.

అతను మరెవరో కాదు, విద్యుత్ అజ్మల్.( Vidyut Ajmal )ఈయన మన సౌత్ లో విలన్ గా చాలా సినిమాల్లో నటించాడు.

శక్తి, ఊసరవెల్లి మరియు తుపాకీ వంటి చిత్రాల్లో ఈయన విలన్ గా మన సౌత్ లో బాగా ఫేమస్.

బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో విలన్ గా చేసాడు కానీ, ఇప్పుడు ఆయన వరుసగా హీరో గానే సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

అజ్ఞాతవాసి సినిమా స్టోరీ లైన్ బాగానే ఉంటుంది కానీ, స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్లే ఆ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

విద్యుత్ అజ్మల్ అభిప్రాయం కూడా అదే.అందుకే ఈ సినిమాని రీమేక్ చెయ్యాలనుకుంటున్నాడు.

ఒకవేళ ఈ సినిమా హిందీ లో హిట్ అయితే మాత్రం త్రివిక్రమ్ ( Trivikram Srinivas )ని పచ్చి బూతులు తిడుతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

"""/" / ఇది ఇలా ఉండగా అజ్ఞాతవాసి తరహా స్టోరీ లైన్ తో ప్రభాస్ 'సాహూ' చిత్రం( Saaho ) తెరకెక్కింది.

కానీ ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది.ఇప్పుడు మళ్ళీ అదే 'అజ్ఞాతవాసి' స్టోరీ లైన్ మీద సినిమా తియ్యాలని అనుకుంటున్నాడంటే బాలీవుడ్ మేకర్స్ కి దండం పెట్టొచ్చు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'అజ్ఞాతవాసి' అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.

మరి హిందీ రీమేక్ ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంక్రాంతి సినిమాల ఓటీటీ డీల్స్ వివరాలు ఇవే.. ఏ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?