నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్… మ్యాటరేంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).

ఈయన తీసిన సినిమాలు హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా చాలా మంచి క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటాయి.

ఇక ఈయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక రకంగా ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉంటుంది అది సక్సెస్ లో అయి ఉండొచ్చు లేదా క్రేజ్ పరంగా అయి ఉండొచ్చు.

ఇక ఇండస్ట్రీలో ఒక పది సంవత్సరాల పాటు సక్సెస్ లేకపోయిన కూడా ఈయన చాలా మంచి క్రేజ్ ను అందుకున్నాడు.

ఇక ఈయనలా సూపర్ స్టార్ డమ్ ను అందుకున్న హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

"""/" / ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ని వాడుకొని చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే.

నితిన్ అయితే పవన్ కళ్యాణ్ ను విపరీతంగా వాడుతూ ఉంటాడు.తనకు ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గుర్తొస్తూ ఉంటాడు.

అందువల్లే నితిన్( Nithiin ) సినిమాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా చూస్తూ ఉంటారు.

ఇక పవన్ కళ్యాణ్ తో సన్నిహిత్యం వల్ల నితిన్ ఈ రోజు ఈ రేంజ్ లో ఉన్నాడు.

లేకపోతే ఆయన సినిమాలను ఎవరు పట్టించుకునే వారు కాదు అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో( Social Media ) పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా విపరీతంగా కామెంట్లైతే చేశారు.

"""/" / ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ డైరెక్షన్ లో తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా కోసం నితిన్ పవన్ కళ్యాణ్ టైటిల్ ని వాడుకోవడమే కాకుండా చిన్న గెస్ట్ రోల్ లో పవన్ కళ్యాణ్ ని కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

అది ఏ క్యారెక్టర్ అనేది ఇంకా రివిల్ చేయడం లేదు కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనే హింట్ అయితే ఇస్తున్నారు.

30 లక్షలతో తీస్తే 13 కోట్ల వసూళ్లను రాబట్టిన ఆ స్టార్ హీరో సినిమా…