మంచు విష్ణుకు భారీ షాకిచ్చిన పవన్ కళ్యాణ్.. మర్యాదకైనా పలకరించకుండా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ కాకుండా మంచు ఫ్యామిలీకి చెందిన విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

నిన్న ప్యానల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా మోహన్ బాబు మెగా ఫ్యామిలీపై తనదైన శైలిలో పంచ్ లు వేశారు.

అయితే తాజాగా ‘మా’ అధ్యక్షుడు విష్ణుకు పవన్ కళ్యాణ్ భారీ షాకిచ్చారు.దత్తాత్రేయ కండక్ట్ చేసిన అలయ్ బలాయ్ ప్రోగ్రామ్ లో మౌనంగా ఉంటూ విష్ణుకు పవన్ కళ్యాణ్ తన పవర్ ను చూపించారు.

మంచు విష్ణు పవన్ కళ్యాణ్ ను పలకరించగా పవన్ కళ్యాణ్ మాత్రం మంచు విష్ణును అస్సలు పట్టించుకోలేదు.

మంచు విష్ణు అసలు తనకు పరిచయం లేని వ్యక్తి అనే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు.

మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చున్నప్పటికీ విష్ణు వైపు చూడటానికి కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించలేదు.

విష్ణు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ హీరోలను ఆహ్వానించలేదు.ఆ కారణం వల్లే పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరించి ఉండవచ్చని తెలుస్తోంది.

"""/"/ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు పెడుతుండగా ఆ పోస్టులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబు, మంచు విష్ణు తమ కుటుంబానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్ల వల్ల పవన్ హర్ట్ అయ్యారని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వల్ల మెగా, మంచు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్టే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు పోలీసులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఉన్న గదిని సీజ్ చేశారు.

పోలీసులు ఎందుకు సీజ్ చేశారనే ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు.మా ఎన్నికల విషయంలో చోటు చేసుకుంటున్న ట్విస్టులపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వచ్చే ఏడాదే పెళ్లి పిల్లలంటూ పోస్ట్!