Pawan Kalyan : నాగబాబు మీద కోపంతోనే వరుసగా హిట్లు కొట్టిన పవన్ కళ్యాణ్..కారణం ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు.దాంతో పవన్ కళ్యాణ్ హీరోగా సెట్ అవుతాడా లేదా అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అయ్యాయి.

ఇక మొదటి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు మనకు అవసరమా అనేలా ప్రవర్తించేవాడట.

ఇక అందులో భాగంగానే ఒక రోజు నార్మల్ గా ఇంట్లో కూర్చుని టివీ చూస్తున్న పవన్ కళ్యాణ్ దగ్గరికి నాగబాబు ( Naga Babu )వచ్చి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నావు కళ్యాణ్ అని అడిగాడట.

"""/" / దాంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలు చేయడం ఆపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడట.

దానికి నాగబాబు పవన్ కళ్యాణ్ మీద సీరియస్ అవుతూ అన్నయ్య ఎంతో నమ్మకంతో నిన్ను ఇండస్ట్రీలో హీరోగా పరిచయం చేశాడు.

ఒక్క సినిమాతో అది కూడా సరిగ్గా సక్సెస్ కానీ సినిమా చేసి ఇప్పుడు వెనుతిరిగితే నువ్వు ఫెయిల్యూర్ గా గుర్తింపబడతావు.

అలాగే అన్నయ్య కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. """/" / నువ్వు హీరోగా చేయడం నీకు చేతకాకపోతే ముందే నేను హీరోగా చేయను నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే అయిపోయేది కదా అని నాగబాబు చాలా సీరియస్ గా మాట్లాడుతూనే, నీకు దమ్ముంటే ఒక్క సినిమా హిట్టు కొట్టి చూపించు కళ్యాణ్ అని నాగబాబు పవన్ కళ్యాణ్ ని భారీగా రెచ్చగొట్టడట.

దాంతో కోపానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఒక్కటి కాదు, వరుసగా అయిదు హిట్టు కొట్టి చూపిస్తా అని నాగబాబుతో ఛాలెంజ్ చేశాడంట.

ఇక దాంతో అప్పటి నుంచి దర్శకులతో కలుస్తూ స్క్రిప్ట్ లు వింటు ఉండేవాడట, ఇక అందులో భాగంగానే ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో గోకులంలో సీత( Gokulamlo Seeta ) అనే సినిమాకి కమిట్ అయ్యాడు.

ఇక పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే వరుసగా 5 హిట్లు కాదు, ఆరు హిట్టు కొట్టి చూపించాడు.

ఇక ఇప్పుడు ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల దగ్గర మా అన్నయ్య అలా రెచ్చగొట్టి ఉండకపోతే ఇప్పటికీ నేను ఇండస్ట్రీ లో ఉండేవాణ్ణి కాదేమో అని ఫన్నీ గా చెబుతూ నవ్వుకుంటాడట.

విశ్వంభర లో చిరంజీవి త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారా..?