వీరమల్లు సంగతేమో కానీ మరోటి మొదలు కానుందట!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )హీరోగా క్రిష్ దర్శకత్వం లో ఎప్పుడో ప్రారంభం అయిన హరి హర వీరమల్లు సినిమా( Hari Hara Veeramallu ) షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి అవ్వలేదు.
దాదాపు గా సగం షూటింగ్ ను ముగించిన పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయ యాత్ర తో బిజీగా ఉండగా మరో వైపు ఇతర సినిమా లను ముగించే పని లో ఉన్నాడు.
బ్రో సినిమా ఈ మధ్య ప్రారంభించి అప్పుడే విడుదలకు సిద్ధం చేయడం జరిగింది.
"""/" /
ఇదే నెలలో బ్రో సినిమా( Bro Movie ) విడుదల అవ్వబోతుంది.
మరో వైపు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ను కూడా చకచక షూటింగ్ ముగిస్తున్నారు.
అంతే కాకుండా మరో వైపు ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న విషయం తెల్సిందే.
ఇన్ని సినిమా లు ఉండగానే బ్రో సినిమా ను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి తో కలిసి మరో సినిమా ను చేసేందుకు గాను పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవ్వబోతుంది.ఎవరి దర్శకత్వం లో ఆ సినిమా ఉంటుంది అనేది కూడా క్లారిటీ లేదు.
కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని మాత్రం వార్తలు వస్తున్నాయి.
బ్రో సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత మాట్లాడుతూ ఈ విషయాన్ని దృవీకరించాడు.
"""/" /
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో మరో సినిమా ఓకే కానీ హరి హర వీరమల్లు సినిమా మొదలు పెట్టేది ఎప్పుడు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
క్రిష్ దర్శకత్వం లో ఏఎం రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు సినిమా కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశారు.
ఆ మొత్తం రాబట్టుకోవాలి అంటే రెండు భాగాలుగా విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
ఎప్పటికి షూటింగ్ ను ముగిస్తారు.ఎప్పటికి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో అంటూ ఎదురు చూస్తున్నారు.
హీరో గా పవన్ కళ్యాణ్ కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఆయన వచ్చే ఎన్నికల తర్వాత డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
How Modern Technology Shapes The IGaming Experience