పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు పూర్తి అవ్వడం కూడా కష్టమేనా?

పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు పూర్తి అవ్వడం కూడా కష్టమేనా?

పవన్‌ కళ్యాణ్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ వకీల్‌ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలతో సక్సెస్ లను దక్కించుకున్నాడు.

పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు పూర్తి అవ్వడం కూడా కష్టమేనా?

పవన్ కళ్యాణ్ మరో వైపు హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, వినోదయ్య సిత్తం మరియు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా ను కమిట్‌ అయ్యాడు.

పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు పూర్తి అవ్వడం కూడా కష్టమేనా?

ఇన్ని సినిమాలు ఉన్న సమయంలోనే పవన్ బస్సు యాత్ర అంటూ ఈ దసరా నుండి ఏపీలో ఆరు నెలల పాటు పర్యటించేందుకు సిద్దం అయ్యాడు.

ఆరు నెలల పాటు బస్సు యాత్ర చేయగానే 2024 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతాయి.

దాంతో పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్‌ లో పాల్గొనాలి అంటే 2025 వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు.

బస్సు యాత్ర ప్రారంభం కు ముందే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్‌ అయ్యి ఉన్న సినిమా లను కంప్లీట్‌ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కాని అది ఎంత వరకు సాధ్యం అనేది తెలియడం లేదు.నేడు కూడా పర్యటనకు పవన్ వెళ్లాడు.

కనుక షూటింగ్ కు సమయం ఇవ్వడం చాలా కష్టంగా మారింది.క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా కాకుండా మరే సినిమా ను కూడా పవన్‌ ముగించే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

నిన్న మొన్నటి వరకు వినోదయ్య సిత్తం సినిమా ను కేవలం 45 రోజుల్లో పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు.

సముద్ర ఖని దర్శకత్వం లో త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ పర్యవేక్షణలో సినిమా రూపొందబోతుందని అంతా చర్చ జరిగింది.

ఇప్పటికే సాయి మాధవ్ బుర్ర స్క్రిప్ట్‌ కూడా రెడీ చేశాడు అంటూ చర్చలు జరుగుతున్నాయి.

ఈ సమయంలో పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ పరిశీలకులు షూటింగ్‌ లో మళ్లీ పవన్‌ ఎప్పుడు పాల్గొనేది చెప్పలేమని అంటున్నారు.

ప్రస్తుతం కమిట్‌ అయిన సినిమా లు.ఓకే చెప్పిన సినిమా లను కూడా మొదలు పెట్టే అవకాశం ఉందా అంటున్నారు.

పవన్‌ కళ్యాణ్ మరియు హరీష్‌ శంకర్ కాంబోలో రూపొందాల్సిన భవదీయుడు భగత్‌ సింగ్ సినిమా కనీసం మొదలు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు అంటున్నారు.

అప్పుడు రజనీకాంత్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్… జపాన్ లో ఆ ఘనత వీళ్లకే సొంతమా?

అప్పుడు రజనీకాంత్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్… జపాన్ లో ఆ ఘనత వీళ్లకే సొంతమా?