‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ క్లోసింగ్ కలెక్షన్స్..సరైన ప్లానింగ్ లేకపోయినా ఇంత వసూళ్లు వచ్చాయా!
TeluguStop.com
మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఎప్పటి నుండో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.
'పోకిరి' సినిమాతో( Pokiri ) ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
అభిమానులు ఈ ట్రెండ్ ని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.ప్రతీ హీరో సినిమా రీ రిలీజ్ అవుతుంది కానీ, రికార్డ్స్ మాత్రం పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు సినిమాలు మాత్రమే క్రియేట్ చేసాయి.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన 'జల్సా' మరియు 'ఖుషి' చిత్రాలు రీ రిలీజ్ ట్రెండ్ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పగా, మహేష్ బాబు 'పోకిరి' మరియు 'బిజినెస్ మెన్' చిత్రాలు అదే విధంగా రికార్డ్స్ క్రియేట్ చేసాయి.
అయితే ఈసారి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 'గుడుంబా శంకర్' చిత్రాన్ని( Gudumba Shankar ) గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.
ఈ సినిమా కచ్చితంగా 'బిజినెస్ మెన్'( Business Man ) రీ రిలీజ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అందరూ అనుకున్నారు.
కానీ ఆ మూవీ టీం చేసిన పూర్ ప్లానింగ్ వల్ల ఈ చిత్రం కలెక్షన్స్ విషయం లో అంచనాలను అందుకోలేకపోయింది.
ముందుగా ఈ సినిమాని ఆగష్టు 31 వ తారీఖున విడుదల చేద్దాం అని అనుకున్నారు.
ఎందుకంటే సెప్టెంబర్ 1 వ తారీఖున విజయ్ దేవరకొండ 'ఖుషి' చిత్రం( Kushi Movie ) విడుదల అవుతుంది.
థియేటర్స్ సమస్య వస్తుంది అని అలా ప్లాన్ చేసారు.కానీ ఆగష్టు 25 వ తారీఖున నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరో గా నటించిన 'గాండీవ దారి అర్జున'( Gandeevadhari Arjuna ) చిత్రం విడుదలైంది.
"""/" /
ఈ చిత్ర నిర్మాత బూరగవల్లి ప్రసాద్ గుడుంబా శంకర్ విడుదల ప్రభావం కచ్చితంగా నా సినిమా మీద పడుతుంది, దయచేసి గుడుంబా శంకర్ చిత్రాన్ని సెప్టెంబర్ 2 వ తేదికి వాయిదా వెయ్యండి అని రిక్వెస్ట్ చేసాడట.
ఆయన రిక్వెస్ట్ ని కాదు అనలేక నాగబాబు 'గుడుంబా శంకర్' సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు.
దానికి తగ్గట్టుగానే పలు థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్( Advance Bookings ) వారం రోజుల ముందుగానే ఓపెన్ చేయించాడు.
టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి, కానీ కొత్త షోస్ మాత్రం యాడ్ అవ్వడం లేదు, అభిమానులు చాలా చిరాకు పడ్డారు.
"""/" /
అలా కొత్త షోస్ యాడ్ అవ్వకపోవడానికి కారణం థియేటర్స్ ఇవ్వకపోవడమే.
దీంతో 31 వ తేదీన మళ్ళీ జరిగి కొన్ని షోస్ యాడ్ చేసారు, అభిమానులు పూర్తిగా అయ్యోమయ్యం కి గురి అయ్యారు.
అలా మొత్తం గా గుడుంబా శంకర్ రీ రిలీజ్( Gudumba Shankar Rerelease ) ఈవెంట్ సరైన ప్లానింగ్ లేకుండా తికమక గా షోస్ పడ్డాయి.
అయినప్పటికీ కూడా ఈ సినిమాకి దాదాపుగా మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
కేవలం నైజాం ప్రాంతం నుండే ఈ సినిమాకి కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందట.
ముందు అనుకున్న విధంగా సరైన ప్లానింగ్ తో ఈ సినిమాని విడుదల చేసి ఉంటే కచ్చితంగా ఆల్ టైం రికార్డు నెలకొల్పి ఉండేదని అంటున్నారు విశ్లేషకులు.
నాకెప్పుడూ చరణ్ సత్తా మీద డౌట్ లేదు.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!