‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ప్రింట్ లో చాలా మార్పులు..క్లైమాక్స్ ఫైట్ ఎత్తేస్తున్నారా..?

‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ప్రింట్ లో చాలా మార్పులుక్లైమాక్స్ ఫైట్ ఎత్తేస్తున్నారా?

టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ప్రింట్ లో చాలా మార్పులుక్లైమాక్స్ ఫైట్ ఎత్తేస్తున్నారా?

స్టార్ హీరోల అభిమానులు ఈ ట్రెండ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.

‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ప్రింట్ లో చాలా మార్పులుక్లైమాక్స్ ఫైట్ ఎత్తేస్తున్నారా?

గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి చిత్రం ని( Pokiri ) గ్రాండ్ గా విడుదల చేసారు.

అప్పుడు ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రీ రిలీజ్ అయ్యి దుమ్ము లేపేవి.

కానీ ఇప్పుడు చిన్న హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నాయి.

ఈమధ్యనే 'ఈ నగరానికి ఏమైంది' అనే చిత్రం రీ రిలీజ్ అయ్యి వసూళ్ల సునామి సృష్టించింది.

ఇప్పుడు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అనే చిత్రం కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

"""/" / రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'బిజినెస్ మేన్' ( Business Man Movie ) చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నారు.

ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి.కచ్చితంగా ఈ చిత్రం ఆల్ టైం టాప్ 1 గా నిలిచి ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొడుతుందనే బలమైన నమ్మకం తో ఉన్నారు మహేష్ ఫ్యాన్స్ తో పాటుగా ట్రేడ్ పండితులు కూడా.

ఇది అయిపోగానే వచ్చే నెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పుట్టినరోజు సందర్భంగా 'గుడుంబా శంకర్' ని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.

ఈ సినిమా ని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఎందుకంటే ఈ చిత్రం కి వచ్చే వసూళ్లు మొత్తాన్ని జనసేన పార్టీ కి( Janasena Party ) ఫండ్స్ గా ఇవ్వబోతున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 4K పనులు మొత్తం పూర్తి అయ్యాయి. """/" / అయితే గుడుంబా శంకర్ సినిమాలో( Gudumba Shankar Movie ) క్లైమాక్స్ పార్ట్ బాగా మైనస్ అయ్యింది అనే విషయం అందరికీ తెలిసిందే.

అప్పట్లో ఈ క్లైమాక్స్ ఫైట్( Climax Fight ) వల్లే సినిమాకి ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది.

ఇప్పుడు ఆ క్లైమాక్స్ పార్ట్ మొత్తాన్ని తొలగించే పనిలో పడ్డారట మేకర్స్.డైరెక్టర్ వీర శంకర్ ని పిలిపించి ఆ పార్ట్ మొత్తం ట్రిమ్ చేసేలా చేస్తున్నారట.

అంతే కాదు, సినిమా చివర్లో జనసేన పార్టీ కి సంబంధించి ఒక పొలిటికల్ ఎడిట్ కూడా జత చేయబోతున్నట్టు సమాచారం.

ఈ ఎడిట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే విధంగా ఉంటుందట.

అంతే కాదు , సినిమా ప్రారంభం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చాలా స్టైలిష్ గా మంచి వీఎఫ్ఎక్స్ ఎడిట్ తో ఉంటుందట.

దీనిని త్వరలోనే సెన్సార్ కి పంపించి , సినిమా విడుదల తేదీ అధికారికంగా ప్రకటించబోతున్నట్జు సమాచారం.

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఎమోషనల్ పోస్ట్ చేసిన బండ్ల గణేష్… జాగ్రత్త అంటూ!