ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.. పవన్‌ ఫ్యాన్స్‌ టెన్షన్‌

తెలుగులో ఒక సామెత ఉంది ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.ఏదైనా ఆట అయినా లేదంటే మరేదైనా చాలా స్పీడ్‌ గా ముందుకు వెళ్తున్న సమయంలో కొందరు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా కింద పడిపోయే దానికి ఆగిపోయేదానికి ఇంత స్పీడ్‌ ఏంటో అంటూ కొందరు గుసగుసలాడుకుంటూ ఉంటారు.

ఆ విషయం ఇప్పుడు కొందరు పవన్‌ కు వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వచ్చే ఏడాది వకీల్‌ సాబ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్‌ ఆ తర్వాత వరుసగా రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున అరడజను సినిమాల వకు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.

గతంలో ఏడాది రెండేళ్లకు ఒక్కటి సినిమా చేసిన పవన్‌ ఇప్పుడు ఏడాదికి అరడజను సినిమాలు అనడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.

పవన్‌ సినిమాలను ఆపేయాలనే నిర్ణయానికి వచ్చి ఇలా ఎక్కువ సినిమాలు చేసేయాలని ఈ ఏడాది ఎక్కువ సినిమాలకు కమిట్‌ అవుతున్నాడేమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా కొందరు యాంటీ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాని పవన్‌ అభిమానులు మాత్రం పవన్‌ ప్రతి సినిమా ప్రకనను ఎంజాయ్‌ చేస్తున్నారు.

తాజాగా మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పన్‌ కోషియమ్‌ ను రీమేక్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో అంచనాలు భారీగా పెంచేసుకున్నారు.

వకీల్‌ సాబ్‌ సినిమా తర్వాత పవన్‌ కళ్యాణ్‌ చేయబోతున్న సినిమాలకు క్రిష్‌.హరీష్‌ శంకర్‌, సురేందర్‌ రెడ్డి, బాబీ, సాగర్‌ లు దర్శకత్వం వహించబోతున్నారు.

బండ్ల గణేష్‌ నిర్మాణంలో కూడా పవన్‌ ఒక సినిమాను చేయబోతున్నాడు.మొత్తానికి 2021 మరియు 22 సంవత్సరంల్లో ఏకంగా పది సినిమాలను పవన్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది అభిమానులకు నిజంగా అతి పెద్ద గుడ్‌ న్యూస్‌.ఎవురు ఏం అనుకున్నా కూడా పవన్‌ వరుస చిత్రాలు చేయడం ఫ్యాన్స్‌ కు ఆనందంను ఇచ్చే వార్త.

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పై వైసీపీ సంచలన ఆరోపణలు