పవన్‌ కళ్యాణ్ ‘ఓజీ’ కోసం 15 రోజులు కేటాయించాడా..!

పవన్ కళ్యాణ్‌( Pawan Kalyan ) ఇప్పటికే క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమాను, హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్‌ భగత్ సింగ్ మరియు సాహో సుజీత్ దర్శకత్వం లో ఓజీ సినిమా ను మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

ఈ మూడు సినిమాలు కూడా మధ్య లో షూటింగ్స్ ఉన్నాయి.కానీ ఈ మూడు సినిమా లను పవన్‌ ఈ ఏడాది పూర్తి చేసేలా కనిపించడం లేదు.

"""/" / వచ్చే ఏడాది ఎలాగూ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) ఉన్నాయి.

కనుక షూటింగ్‌ లో పాల్గొనడు.కనుక వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రమే పవన్ సినిమా లు ఉంటాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.తెలంగాణ లో తమ పార్టీ అభ్యర్థులను నిలిపింది.

కనుక ప్రచారం చేయాల్సి ఉంటుంది.ఇలాంటి సమయంలో ఓజీ సినిమా కోసం రెండు వారాల సమయం ను కేటాయించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

"""/" / డిసెంబర్‌ లో పవన్‌ కళ్యాణ్ ఓజీ( OG Movie 0 షూటింగ్‌ లో పాల్గొంటాడు అంటూ నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారట.

ఈ విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది.ఎంత షూటింగ్ చేసినా కూడా వచ్చే ఏడాది ద్వి తీయార్థం తర్వాత మాత్రమే పవన్‌ కళ్యాణ్ సినిమా లు ప్రేక్షకుల ముందుకు వస్తాయి.

వచ్చే ఏడాది లో ఈ మూడు సినిమా లు వస్తాయా అంటే అది కూడా అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఓజీ సినిమా లో ప్రియాంక అరుల్‌ మోహన్ నటిస్తున్న విషయం తెల్సిందే.ఇక హరి హర వీరమల్లు సినిమా లో నిధి అగర్వాల్‌ నటిస్తోంది.

అంతే కాకుండా ఉస్తాద్‌ లో శ్రీ లీల నటిస్తోంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?