క్రేజీ రూమర్.. మరోసారి బాలయ్య కోసం పవన్.. ఇదే నిజమైతే పూనకాలే!

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సినిమాలతో పాటు టాక్ షోకు హోస్ట్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈయన అఖండ సినిమాతో సక్సెస్ అందుకోవడమే కాకుండా మొదటిసారి హోస్ట్ గా చేసిన షో కూడా సక్సెస్ అందుకోవడం నందమూరి ఫ్యాన్స్ ను సంతోష పరిచాయి.

చాలా రోజుల తర్వాత బాలయ్య సక్సెస్ బాట పట్టడంతో ఉత్సాహంగా ఉన్నారు.ఇదిలా ఉండగా బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో 'అన్ స్టాపబుల్'.

సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కూడా ఇటీవలే స్టార్ట్ చేసారు.

ఇప్పటికే సీజన్ 2 లో చాలా మంది సెలెబ్రిటీలు పాల్గొన్నారు. """/"/ అయితే త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన బోతున్నారు అని కన్ఫర్మ్ అయ్యింది.

అలాగే బాలయ్య వీరసింహారెడ్డి సినిమా సెట్స్ లో పవన్ కళ్యాణ్ కనిపించడం కూడా ఆసక్తిగా మారింది.

మరి ఇదే కాకుండా ఇప్పుడు ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్ ఉందని క్రేజీ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సెన్సేషనల్ కలయిక ఇప్పుడు మరోసారి కనిపించ బోతుందట.అది కూడా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అని తెలుస్తుంది.

బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. """/"/ ఈ సినిమా 2023లో సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవర్ స్టార్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు అని టాక్ వస్తుంది.

ఇదే నిజమైతే అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇటు నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలే.

చూడాలి ఈ రూమర్ ఎంత వరకు నిజమో.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.

కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రశాంత్ వర్మ చేస్తున్న జై హనుమాన్ సినిమా లో క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది…