పవన్ క్రిష్ సినిమా.. ఓ కోహినూర్ వజ్రం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన 26వ చిత్రంగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవడానికి పవన్ రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను లాంఛ్ చేసిన చిత్ర యూనిట్, ఈ చిత్ర షూటింగ్‌లో త్వరలో పాల్గొనూందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో భారతదేశానికి చెందిన కోహినూర్ డైమండ్‌ను బ్రిటీష్ వారి దగ్గర నుండి దొంగలించేందుకు పవన్ ప్రయత్నిస్తాడట.

ఇలాంటి రాబిన్‌హుడ్ తరహా పాత్రలో పవన్ ఎలా కనిపిస్తాడా అనే అంశం చాలా ఆసక్తిగా మారింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

తమిళ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పొతినేని డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?