పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తే సులువుగా లక్ష మెజారిటీ వస్తుందట.. కానీ?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా ఆయన విజయం సాధించలేదు.

అయితే పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తే మాత్రం లక్ష మెజారిటీ గ్యారంటీ అని తెలుస్తోంది.

జనసేన పార్టీ తిరుపతి కమిటీ పవన్ కు ఈ మేరకు చెప్పిందని సమాచారం అందుతోంది.

2009 సంవత్సరంలో చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కు చేదు ఫలితాలు ఎదురైన నేపథ్యంలో జనసైనికులు సైతం తిరుపతి నుంచి పోటీ చేయడం మంచిదని సూచనలు చేస్తున్నారు.

పవన్ సామాజికవర్గం కూడా తిరుపతిలో బలంగా ఉండటంతో జన సైనికులు తిరుపతిని సెంటిమెంట్ గా భావిస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో మాత్రం చెప్పలేమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే 2009 నాటి పరిస్థితులకు, 2024 నాటి పరిస్థితులకు చాలా తేడా వచ్చింది.

పవన్ నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకుని ముందడుగులు వేస్తే మాత్రం అనుకూల ఫలితాలు కలగడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

2024 ఎన్నికల్లో పవన్ టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. """/"/ బీజేపీ మాత్రం గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు.

మరోవైపు జనసేన ఇతర పార్టీలతో పొత్తు లేకుండా పోటీ చేస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

2024 ఎన్నికల సమయానికి ఏపీ రాజకీయాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

2024లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు.

సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

పెళ్లికి ముందే శోభితకు నాగచైతన్య  అలాంటి కండిషన్ పెట్టాడా… వామ్మో?