అను ఇమ్మాన్యుయేల్ చేసిన పనికి ఫిదా అవుతున్న పవన్ ఫ్యాన్స్.. తమిళంలో క్రేజ్ పెంచారంటూ?
TeluguStop.com
తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో గుర్తింపును సంపాదించుకోని హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్( Anu Emmanuel ) ఒకరు.
అను ఇమ్మాన్యుయేల్ కు వరుస ఆఫర్లు వస్తున్నా ఆమె కెరీర్ పరంగా మరీ ఊహించని స్థాయిలో ఎదిగే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే అను ఇమ్మాన్యుయేల్ నటించిన జపాన్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
25 సినిమాల అనుభవం ఉన్న కార్తీ( Karthi ) ఇలాంటి సినిమాలో ఎందుకు నటించారో అర్థం కావడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
"""/"/
అయితే అను ఇమ్మాన్యుయేల్ జపాన్ మూవీ( Japan Movie )లో చిన్న రోల్ లో నటించినా ఆ రోల్ తో ఆకట్టుకున్నారు.
క్రిటిక్స్ నుంచి అను ఇమ్మాన్యుయేల్ పై నెగిటివ్ కామెంట్లు( Negative Comments ) వినిపించినా సాధారణ ప్రేక్షకులను మాత్రం ఆమె తన నటనతో మెప్పించారు.
జపాన్ మూవీలో ఈ బ్యూటీ ఫిల్మ్ ఛాన్సెస్ కోసం ప్రయత్నించే యువతిగా, ఫిల్మ్ స్టార్ గా కనిపించారు.
ఫిల్మ్ స్టార్ అయిన సమయంలో అజ్ఞాతవాసి సినిమాలో ఈ బ్యూటీ నటించినట్టు చూపించడం, అజ్ఞాతవాసి పోస్టర్లు( Agnathavasi ) ఈ సినిమాలో కనిపించడంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
తమిళంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ పెంచారంటూ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. """/"/
అను ఇమ్మాన్యుయేల్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో ఊర్వశివో రాక్షసివో( Urvasivo Rakshasivo ) తప్ప ఏ సినిమా సక్సెస్ కాలేదు.
రాబోయే రోజుల్లో ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తాయో రావో చూడాల్సి ఉంది.అను ఇమ్మాన్యుయేల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం పెరుగుతోంది.
అను ఇమ్మాన్యుయేల్ కు కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కాల్సి ఉంది.అను ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.
తలనొప్పిగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడని తప్పులు ఇవే!