దిల్ రాజు షాకయ్యేలా చేసిన పవన్ ఫ్యాన్.. ఏం జరిగిందంటే..?
TeluguStop.com
శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
శని, ఆదివారాలకు కూడా టికెట్స్ బుక్ కాగా వకీల్ సాబ్ తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా దర్శకునిగా వేణు శ్రీరామ్ కు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు నిర్మాతగా దిల్ రాజుకు భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే ఒక అభిమాని మాత్రం చేసిన పని సినిమా నిర్మాత దిల్ రాజును షాకయ్యేలా చేసింది.
గతంలో పవన్ సినిమాలలో కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన దిల్ రాజు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన 22 సంవత్సరాల తర్వాత నిర్మాత కావాలనే కలను నెరవేర్చుకున్నారు.
"""/"/
ఒక అభిమాని వకీల్ సాబ్ సినిమాకు హిట్ టాక్ రావడంతో దిల్ రాజు కాళ్లపై పడి నమస్కరించారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలను దిల్ రాజు నిజం చేశాడని ఆ అభిమాని పేర్కొన్నారు.
దిల్ రాజు కాళ్లపై అభిమాని కొంత సమయం ఉండిపోగా దిల్ రాజు ఆ వ్యక్తిని కూల్ చేశాడు.
అభిమాని చేసిన పనితో పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంతలా నచ్చిందో సులభంగానే అర్థమవుతుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఓవర్సీస్ లో కూడా వకీల్ సాబ్ భారీగా కలెక్షన్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా కేసులు పెరుగుతున్నా పవన్ సినిమాను చూడటానికి అభిమానులు క్యూ కడుతుండటం గమనార్హం.
ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ తీసుకోగా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ తీసుకుందని సమాచారం.
ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?