అన్నయ్య ఒక మేరు పర్వతం.. తండ్రిలా పెంచారు.. చిరంజీవి కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పవన్ కళ్యాణ్ భావోద్వేగం...

అన్నయ్య ఒక మేరు పర్వతం.తండ్రిలా పెంచారు.

చిరంజీవి కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పవన్ కళ్యాణ్ భావోద్వేగం.మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జన్మదినోత్సవాన్ని కుటుంబ కార్యక్రమముల చిరంజీవి అభిమానులతో పాటు సినీ పరిశ్రమ జరుపుకుంది.హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అంటూ గ్రీటింగ్స్ చెప్పారు.

చిరంజీవి సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కోట్లాది మంది అభిమానుల్లో ఒకరుగా నిలిచారు.

తన అన్నకు బర్త్ డే విషెస్ తెలిపారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

చిరంజీవి తనకే కాదు ఎందరికో మార్గదర్శని మరెందరికో స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.

ఆయన గురించి ఎంత చెప్పినా కొన్ని కొన్ని మిగిలే ఉంటాయని వ్యాఖ్యానించారు.ఆయనకు తమ్ముడు గా పడడం ఒక అదృష్టమని అన్నారు.

చిరంజీవి లోని సుగుణాలు చూస్తూ పెరగడం మరో అదృష్టం అని చెప్పారు ఆయన ఆరాధించే లక్షలాదిమంది అభిమానులలో తాను తొలి స్థానంలో ఉంటానని పేర్కొన్నారు.

చిరంజీవిని, ఆయన సినిమాలను చూస్తూ పెరిగానని ఉన్నతని కళ్లారా వీక్షించానని వ్యాఖ్యానించారు.అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడిని చిరంజీవిని కీర్తించారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోనే అద్భుత లక్షణమని, భారతీయ సినీ యవనికపై తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొన్నప్పటికీ గర్వాన్ని ప్రదర్శింలేదన్నారు.

పద్మభూషణ్ అవార్డు రాజ్యసభ సభ్యుడిగా కేంద్రమంత్రిగా పదవులు అందుకున్న ఎక్కడ తల ఎగరవేయలేదని చెప్పారు.

బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ నెలకొల్పి ఆపదలో ఉన్న ఎంతో మందికి ఆదుకున్నారని చెప్పారు.

కరోనా సమయములో పనుల్లేక అల్లాడిపోయిన సినీ కార్మికుల ఆకలి తీర్చడానికి చిరంజీవి ఎంతో తపన పడ్డారు అన్నారు.

అన్న గా జన్మించినా.తండ్రిలా పెంచారని కొనియాడారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్?