ఆ డైరెక్టర్‌తో కుదరలేదంటోన్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను ‘వకీల్ సాబ్’ పేరుతో తెరకెక్కిస్తూ రిలీజ్‌కు రెడీ చేసిన పవన్, తన నెక్ట్స్ చిత్రాలను కూడా క్యూలో పెట్టేందుకు చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఆ తరువాత మరో డైరెక్టర్ డాలీతో కలిసి ఓ సినిమా చేసేందుకు పవన్ ఓకే చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.పవన్ డాలీ కాంబినేషన్‌లో సినిమా ఇంకా ఓకే కాలేదని, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త కూడా అఫీషియల్‌గా రాకపోవడంతో అసలు ఈ సినిమా ఉందా లేదా అనే సందేహం అందిరలో నెలకొంది.

గతంలో డాలీ డైరెక్షన్‌లో గోపాల గోపాల, కాటమరాయుడు చిత్రాల్లో నటించిన పవన్, మరోసారి ఆయన డైరెక్షన్‌లో చేస్తాడా లేదా అనేది చూడాలి.

ఇక ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రాన్ని పవన్ వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

అటు క్రిష్ చిత్రాన్ని కూడా నాన్-స్టాప్‌గా షూటింగ్ చేసి పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు.

మరి డాలీ డైరెక్షన్‌లో పవన్ సినిమా ఉందో లేదో చూడాలి.

పచ్చడి మెతుకులు తిన్నాను.. ఆఫీస్ బాయ్ గా పని చేశా.. అవినాష్ కన్నీటి కష్టాలు ఇవే!