పవన్ కళ్యాణ్ కి హిట్ ఇచ్చేముందు ఈ డైరెక్టర్స్ మరో సక్సెస్ కొట్టాల్సిందేనా ?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో సినిమా అంటే అంత ఆషామాషీ కాదు.

ఆయన సినిమా మరియు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.మరి పవన్ కళ్యాణ్ ఒక్కసారి కథ ఓకే చెప్పాక ఎప్పుడు షూటింగ్ కి వెళ్తుందో అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ దేవుడు కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది.

ఒక్కసారి పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసి స్టార్ డైరెక్టర్ అయిపోవచ్చు లేదా కోట్ల కొద్ది కలెక్షన్స్ కొల్లగొట్టొచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది కథలను చాలా గట్టిగా తయారు చేసుకుని ఆయనకు వినిపించి సక్సెస్ అయ్యారు.

కానీ వారికి సినిమాలను పూర్తి చేసుకోవడం మాత్రం ఇప్పుడు కత్తి మీద సాముల మారింది.

అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి ముందు ఈ దర్శకులంతా మరో ప్రయోగానికి సిద్ధమైపోతున్నారు.

"""/" / ఉదాహరణకు పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్టు కొట్టిన దర్శకుడు హరీష్ శంకర్.

వీరిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Sing )అనే సినిమా రావాల్సి ఉంది.

అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు టైం ఇస్తారో తెలియక హరి శంకర్ ఈలోపు మరో సినిమాకి కమిట్ అయ్యారు.

అదే రవితేజతో వస్తున్న మిస్టర్ బచ్చన్.ఉస్తాద్ షూటింగ్ మొదలయ్యేలోపు ఈ సినిమాని పూర్తి చేసుకుని విడుదల చేసి గట్టిగా హిట్టు కొట్టి పవన్ కళ్యాణ్ ముందు కాలర్ ఎగరేసి నిలబడాలనుకుంటున్నాడు హరీష్ శంకర్.

మరి ఆశలు అన్ని గల్లంతవ్వకుండా ఉండాలంటే మిస్టర్ బచ్చన్ ( Mr Bachchan )మంచి సక్సెస్ అందుకోవాలి.

అది జరగాలంటే ఏ సినిమా విడుదల అయ్యేవరకు వేచి చూడాలి. """/" / ఇదే దోవలో క్రిష్ కూడా ఇలాంటి ప్రయోగమే చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ కి మొట్టమొదటి ప్యాన్ ఇండియా సినిమా అంటూ ఊదరగొడుతూ హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) సినిమాను పట్టాలెక్కించేశాడు క్రిష్.

ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చి అప్పట్లో హల్చల్ చేశాయి.

ఇక్కడ వరకు బాగానే ఉంది.అయితే హరీష్ శంకర్ కి ఎలా అయితే పొలిటికల్ ఇబ్బందులు వచ్చాయో అదే విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా క్రిష్ కూడా కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

దాంతో ఈలోపు వేదం సినిమాతో క్రిష్, అనుష్క కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది కాబట్టి మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలు తెరకెక్కించాలని సర్వం సిద్ధం చేసుకున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటుంది.ఇది హిట్ అయితే పవన్ కళ్యాణ్ కి కూడా మంచి హిట్టు దొరుకుతుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ కి హిట్ ఇవ్వాలంటే ఈ ఇద్దరు దర్శకులు ఇప్పుడు వారు చేస్తున్న ప్రాజెక్టు హిట్ అయ్యి తీరాల్సిందే.

లేదంటే వారు తీయబోయే పవన్ కళ్యాణ్ సినిమాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.

రజినీకాంత్ కూలీ సినిమాలో మలయాళ నటుడు…