ఫాలోవర్లు ఓటేసినా పవన్ సీఎం ఖావడం ఖాయమా.. ఆ ఒక్క పని చేస్తే చాలంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) పేరు వింటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అనే సంగతి తెలిసిందే.

పవన్ ఫ్లాప్ సినిమాలు సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన సందర్భాలు కోకొల్లలు.

ఈ ఆర్టికల్ రాసే సమయానికి పవన్ ఫాలోవర్స్ సంఖ్య 2 మిలియన్లుగా ఉంది.

ఈ రికార్డును సృష్టించాలన్నా తిరగరాయాలన్నా సులువైన విషయం కాదు.పవన్ కోసమే కొత్తగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను క్రియేట్ చేసిన ఫ్యాన్స్ సంఖ్య కోకొల్లలు.

"""/" / సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల మనస్సులను గెలుచుకుని రాజకీయాలపై పవన్ పూర్తిస్థాయిలో 2024 ఎన్నికల వరకు దృష్టి పెడితే పవన్ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సీఎం కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు వాళ్ల కుటుంబాలు, బంధువులతో ఓట్లు వేయించినా పవన్ సీఎం అవుతాడని సోషల్ మీడియా( Social Media ) వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గ్రామ, మండల స్థాయిలో జనసేన ( Jana Sena )ను పూర్తిస్థాయిలో బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చే వరకు ఏదో ఒక రాష్ట్రంపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పొత్తులు పవన్ వ్యక్తిగత నిర్ణయమని రాష్ట్రానికి మంచి జరిగే విధంగా పవన్ నిర్ణయాలు ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

"""/" / మరోవైపు పవన్ నటించిన బ్రో సినిమా( Bro Movie ) విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మ్యాడ్ స్క్కేర్ పై అంచనాలు పెంచేసిన స్వాతిరెడ్డి సాంగ్.. మరో భారీ హిట్ పక్కా అంటూ?