పవన్ కళ్యాణ్ ధరించిన ఈ ముళ్ల భూట్ల ధర తో ఒక ఇల్లు కొనేయొచ్చు తెలుసా!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే యూత్ కి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అంటే ఎంత పిచ్చి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఆయన వేసుకునే దుస్తులు, ఆయన ధరించే బూట్లు వగైరా ఇవన్నీ కూడా యూత్ అనుసరించడం ఖుషి సమయం నుండి జరుగుతూనే ఉంది.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ధరించే దుస్తులు అప్పట్లో చాలా విచిత్రం గా ఉండేవి.

వాటికి యువత ప్రత్యేకంగా ఆకర్షితులు అయ్యేవారు.అయితే అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ అంత స్టైలిష్ గా కనపడలేదు.

చాలా కాలం తర్వాత ఆయనలోని వింటేజ్ యాంగిల్ ని పూర్తి స్థాయిలో వాడుకుంటూ చూపించిన సినిమా 'బ్రో ది అవతార్'( BRO The Avatar ) చిత్రం.

ఇందులో పవన్ కళ్యాణ్ ఎంత స్టైలిష్ గా కనిపిస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.

ఆయన ధరించే దుస్తులు గుడుంబా శంకర్ , ఖుషి , జల్సా రోజులు గుర్తు చేస్తున్నాయి.

ముఖ్యంగా 'బ్రో ది అవతార్' మూవీ లో ఆయన వేసుకున్న బూట్లు చాలా కొత్తగా ఉన్నాయి.

"""/" / ఇది వరకే మనం ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ లో ఇలాంటి బూట్లను( Shoes ) బాగా గమనించాము.

రీసెంట్ గా విడుదల చేసిన 'బ్రో' మొదటి పాట 'మై డియర్ మార్కండేయ' లో( My Dear Markandeya ) పవన్ కళ్యాణ్ ఎంత స్టైలిష్ గా కనిపించాడో మన అందరం చూసాము.

ఇందులో మనం బాగా గమనిస్తే పవన్ కళ్యాణ్ వేసుకున్న బూట్లు( Pawan Kalyan Shoes ) ముళ్ళతో నిండిపోయి ఉంటుంది.

ఇది గమనించిన అభిమానులు అందుబాటులోకి ఈ బూట్లు ఉంటాయో లేదో అని ఆన్లైన్ లో వెతకగా అవి దొరకలేదు.

అది పవన్ కళ్యాణ్ కోసం గా ప్రత్యేకంగా చేయించి బూట్లు.ఒక్కో బూటు ఖరీదు 3000 అమెరికన్ డాలర్స్ పైనే ఉంటుంది.

దీనిని ఇండియన్ కరెన్సీ లెక్కలో చూస్తే అక్షరాలా రెండు లక్షల 40 వేల రూపాయలకు పైనే అట, రెండు బూట్లు కలిపి నాలుగు లక్షల రూపాయలకు పైనే.

ఇంత మొత్తం డబ్బులు మన దగ్గర ఉంటె ఒక్క చిన్న సైజు ఇల్లే కట్టేసుకోవచ్చు.

"""/" / ఇలాంటి కాస్ట్యూమ్స్ , యాక్ససరీస్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో చాలానే వాడాడట, అవి యూత్ ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది అని అంటున్నారు.

చూడాలి మరి ఈనెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అభిమానులను మరియు ప్రేక్షకులను అన్నీ విధాలుగా ఎలా అలరిస్తుంది అనేది.

ఇకపోతే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ దేవుడి గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, ఆయన పాత్ర చాలా స్టైలిష్ గా , వినోదభరితంగా ఉంటుందట.

అంతే కాకుండా చివరి 30 నిముషాలు చిత్రం చాలా ఎమోషనల్ గా సాగుతుందని అంటున్నారు.

ఇదే కనుక ఆడియన్స్ కి సరిగ్గా కనెక్ట్ అయితే బాక్స్ ఆఫీస్ సునామి మామూలు రేంజ్ లో ఉండదని అంటున్నారు మేకర్స్.

డైలాగ్స్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయట.రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, మరి వచ్చే వారం లో రాబొయ్యే ట్రైలర్ కి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.

ఏపీలో ఆ మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇస్తారా.. తప్పు అస్సలు జరగదంటూ?