వారాహి దీక్షలో సూర్యారాధన చేసిన పవన్.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే అంటూ?

సినీ నటుడు జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న సంగతి మనకు తెలిసిందే ఇలా అమ్మవారి దీక్షలో ఉన్నటువంటి ఈయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.

ఇకపోతే ఇటీవల పవన్ కళ్యాణ్ రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సూర్యరాదన చేశారు.

ఇటీవల మంగళగిరిలోని జనసేన పార్టీ( Janasena Party ) కార్యాలయంలో వేద పండితుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" / మన హిందువులు ఆదివారం ప్రత్యేకంగా సూర్య దేవుడిని పూజిస్తూ ఉంటారు.

ఇలా ఆదివారానికి ఎంతో ప్రత్యేకత ఉన్నప్పటికీ ఆ రోజున సెలవు దినంగా భావించడంతో పెద్దగా సూర్య భగవానుడి విశిష్టత గురించి చాలామందికి తెలియక పోయిండొచ్చు కానీ సూర్యభగవానుడి విశిష్టతను తెలియజేస్తూ వేద పండితులు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ పూజ కోసం ఆదిత్య యంత్రం ఏర్పాటు చేసి దీని ఎదుటు ఆశీనులైన జనసేన అధినేత ప్రత్యక్ష భగవానుడిని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజించారు.

"""/" / పవన్ కళ్యాణ్ గతంలో రోజూ సూర్య నమస్కారాలు చేసే వారు.

అయితే గత కొంతకాలంగా వెన్నుకు సంబంధించిన చిన్న ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు దీంతో సూర్య నమస్కారాలను నిలిపివేసిన పవన్ కళ్యాణ్ తాజాగా సూర్య భగవానుడిని ఆరాధిస్తూ మంత్ర సహిత ఆదిత్య ఆరాధనను వారాహీ దీక్షలో( Varahi Deeksha ) భాగంగా అత్యంత ఘనంగా నిర్వర్తించారు.

11 రోజులపాటు వారాహి దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలా ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేయటంతో ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఈయన గత నెల 25వ తేదీ ఈ దీక్ష వేసిన సంగతి తెలిసిందే.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?