‘ సీఎం ‘ నినాదం పై పవన్ క్లారిటీ ! 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయ వ్యూహాలు ఎవరికి అంతు పట్టడం లేదు.

ఒకవైపు తమకు బలం లేదని చెబుతూనే,  మరోవైపు తనను సీఎం చేయాలని ప్రజలను పదేపదే కోరుతున్నారు.

అలాగే ఒకవైపు టిడిపి( TDP ) తో పొత్తు అంశంపై మంతనాలు చేస్తూనే, మరోవైపు జనసేనను ఒంటరిగా గెలిపించి అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.

దీంతో పవన్ వైఖరిపై టిడిపికి అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి.పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇప్పుడిప్పుడే రెండు పార్టీలు ఒక క్లారిటీకి వస్తున్న సమయంలో,  ఆకస్మాత్తుగా పవన్ తాను ముఖ్యమంత్రి అవుతానని, ప్రజలు తనను ముఖ్యమంత్రి చేయాలని కోరుతుండడం టీడీపీ కి మింగుడు పడడం లేదు.

ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్  సీఎం నినాదం విషయంపై క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వకూడదు అనేదే తన ఉద్దేశం అని పవన్ అన్నారు.

"""/" / వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే, టిడిపి, జనసేన, బిజెపి కలవాలన్నది తన అభిప్రాయమని పవన్ అన్నారు.

అది ఏ స్థాయిలో ఎలా అనేది తానొక్కడినే ప్రతిపాదించేది కాదని,  అన్ని పార్టీల నుంచి దీనిపై ఏకాభిప్రాయం రావాలని పవన్ అన్నారు.

  ఏకాభిప్రాయం కుదరడం కొంత కష్ట సాధ్యమైన విషయమని పవన్ అన్నారు.ఇప్పటికే తాను మూడుసార్లు చంద్రబాబును పొత్తుల అంశంపై చర్చించేందుకు కలిశానని గుర్తు చేశారు.

తనను సీఎం చేయాలని ప్రజలను కోరుకుంటున్న విషయం పైన స్పందించారు.అభిమానులు సీఎం అని నినాదాలు చేస్తుంటే , నేను సిద్ధం అనే సంకేతాలు పంపానని పవన్ అన్నారు.

"""/" /  ముఖ్యమంత్రి పదవి ఒకేసారి వస్తుందా ? అంచలంచలుగా వస్తుందనేది చూడాలని , కోట్లాదిమంది జీవితాలను ముందుకు తీసుకువెళ్లే పదవి అంటే దానికి చాలా అనుభవం కావాలని పవన్ అన్నారు.

దీనికి క్షేత్రస్థాయి పర్యటనలు , సమస్యలపై సరైన అవగాహన తెచ్చుకోవాలని పవన్ పేర్కొన్నారు.

సీఎం సీఎం అని తన వాళ్ళ అదే పనిగా అరుస్తుంటే తన కేడర్ స్టేట్మెంట్ ను ఆమోదించానని పవన్ చెప్పుకొచ్చారు.

పొత్తుల అంశంతో పాటు, అన్ని విషయాల పైన కూర్చుని డైనమిక్ గా ఆలోచించాలని నాలుగు గోడల మధ్య ఊహించుకుని స్పందించడం సరైనది కాదు అని అన్నారు.

ఇన్నిసార్లు టిడిపి అధినేత చంద్రబాబును కలిసినా ఒక్కసారి సీట్ల గురించి తాను చర్చించలేదని , ఎన్నికలు దగ్గరపడే సమయంలో అన్నిటి పైన క్లారిటీ వస్తుందని పవన్  అభిప్రాయపడ్డారు.

భారీ అంచనాలతో వచ్చిన రాయన్ ప్లాప్ అయింది.. మరి ధనుష్ పరిస్థితి ఏంటి..?