క్లారిటీ ఇచ్చేసిన పవన్..?

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి ఇక మిగిలింది ఏపీ ఎన్నికలే.ఈ ఎన్నికలకి మరో కొన్ని నెలలు సమయం ఉండటంతో నేతలు అందరూ సావధానంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికల ఫైట్ పై ఒకే ఒక్క ప్రశ్న లేవనెత్తుతున్నారు ప్రజలు , వివిధ పార్టీల కార్యకర్తలు, మేధావులు అదేంటంటే.

వచ్చే ఎన్నికల్లో త్రికోణ పోరు ఉండబోతోందా.?? లేక పొత్తులతో కూడిన పోరు ఉండబోతోండా అనేది చర్చేనీయంసం అయ్యింది.

ఎందుకంటే.గత కొంత కాలంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కాంగ్రెస్ తో కలిసి తెలంగాణలోలా పోటీ చేస్తుందని చెప్పినా, తాజా పరిస్థితుల దృష్ట్యా ఆ రకమైన వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు.

ఇదిలాఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , వైసీపీ కలిసి పోటీ చేస్తాయని కూడా టాక్ వినిపించింది అయితే ఈ వ్యాఖ్యల్లో నిజం లేదని నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు.

ఎట్టిపరిస్థితుల్లో జనసేన పార్టీ వైసీపీ తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు.

అమెరికాలో ప్రవాసులతో సమావేసమైన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయంలో తమ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఎవరితో పొత్తు పెట్టుకుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

జనసేన కేవలం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వామపక్షాలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందని తేల్చేశారు.

బీజేపీ వల్ల ఏపీ తీవ్రంగా నష్ట పోయిందని చెప్పిన పవన్ కళ్యాణ్ బీజేపీ తో కూడా పొత్తు ఉండదని చెప్పకనే చెప్పారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనతో పార్టీ క్యాడర్ కి మరియు ఏపీ ప్రజలకి సైతం జనసేన భవిష్యత్తు పొత్తులపై తమ విధానాన్ని తెలియచేసినట్టు అయ్యింది.

దాంతో కార్యకర్తలు సైతం ఇప్పుడు ఎలా గ్రామాలలో మేము ముందుకు వెళ్ళాలో అర్థం అవుతోందని, ఈ క్లారిటీతో ఇకనుంచీ కార్యక్రమాలు చేపడుతామని అంటున్నారు.

ఏది ఏమైనా పవన్ ప్రకటన కామ్రేడ్స్ కి ఊపు ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు.