అకీరా.. ఆద్య కొణిదేల వారసులు కారా… ఇంటి పేర్లను మార్చిన పవన్!

సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈయన కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంది సక్సెస్ అందుకున్నారు.

ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

జనసేన పార్టీ( Janasena Party ) ని స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ త్వరలో జరగబోయే ఎన్నికలలో పిఠాపురం( Pithapuram ) నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

ఇలా ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి వారు తప్పనిసరిగా నామినేషన్ వేసేటప్పుడు వారికి సంబంధించిన అన్ని విషయాలను తెలియచేయాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం తన ఆస్తులు అప్పులు టాక్స్ లు, అలాగే తన క్వాలిఫికేషన్ కి సంబంధించిన అన్ని విషయాలతో పాటు తన పిల్లల విషయాలను కూడా వెల్లడించారు.

"""/" / పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే నటి రేణు దేశాయ్( Renu Desai ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరికి ఇద్దరు సంతానం ఇలా పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మరో విదేశీ యుతిని పెళ్లి చేసుకోవడంతో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చి తన పిల్లలను తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు.

ఇలా పిల్లలు దూరమైనప్పటికీ పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలలో పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

"""/" / గత కొద్దిరోజుల క్రితం అకీరా( Akira ) గ్రాడ్యుయేషన్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తండ్రి స్థానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా అకీరా, ఆద్య( Aadhya ) ఇద్దరు ప్రస్తుతం రేణు దేశాయ్ వద్ద ఉంటున్నప్పటికీ వీరిద్దరూ కూడా మెగా వారసులగానే అభిమానులు భావిస్తున్నారు.

ఇక మెగా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగిన వీరిద్దరూ హాజరవుతూ ఉంటారు. """/" / ఇలా మెగా వారసులుగా కొనసాగుతున్నటువంటి అకీరా ఆధ్యా ఇంటి పేర్లను మారుస్తూ ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫీడవిట్ లో వారి పేర్లను రాయడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తైన చర్చలకు కారణమైంది.

తన ఇద్దరు పిల్లలను కొణిదెల అకీరా,ఆద్య అని కాకుండా అకీరా దేశాయ్,( Akira Desai ) ఆద్య దేశాయ్( Aadhya Desai ) అంటూ రాయడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది అంతేకాకుండా వీరిద్దరూ మెగా వారసులు కారా అంటూ అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

పల్నాడు హింసపై జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ సీరియస్