ఈనెల 26వ తారీఖున కూకట్ పల్లి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రచారం..!!

తెలంగాణ ఎన్నికలలో బీజేపీతో కలసి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బీజేపీ 8 స్థానాలు జనసేనకు కేటాయించడం జరిగింది.

మొట్టమొదటిసారి తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో.పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడానికి రెడీ అయ్యారు.

ఆల్రెడీ ప్రధాని మోడీతో బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు.ఇదిలా ఉంటే ఈనెల 26వ తారీకు నాడు కూకట్ పల్లి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఎన్నికలలో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాల సీట్లు కోసం ప్రయత్నం చేయడం జరిగింది.

"""/" /   అయితే కొన్ని అనివార్య కారణాలతోనే శేరిలింగంపల్లి సీటు వదులుకోవాల్సి వచ్చిందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

నవంబర్ 30వ తారీకు ఎన్నికలు, నవంబర్ 28 ప్రచారానికి ఆఖరి తేదీ కావడంతో.

ప్రధాన పార్టీల నేతలు ప్రచారాలలో దూసుకుపోతున్నారు.సమయం కొద్దిగానే ఉండటంతో ప్రజలకు పలు హామీలు ఇస్తూ మరోపక్క ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు.

వాస్తవానికి తెలంగాణ ఎన్నికలలో మొదట ఒంటరిగా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావించారు.

ఈ క్రమంలో 32 నియోజకవర్గాల లిస్ట్ కూడా విడుదల చేసి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

అయితే ఇంతలోనే తెలంగాణ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ తో మాట్లాడి.కలసి పోటీ చేయడానికి ఒప్పించారు.

దీంతో పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది స్థానాలు బీజేపీ కేటాయించడం జరిగింది.జనసేన పోటీ చేసే ఎనిమిది నియోజకవర్గాలలో కూకట్ పల్లి ఒకటి.

ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో వచ్చే ఆదివారం ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొనబోతున్నారు.

చిరంజీవి విశ్వంభర సినిమాతో సక్సెస్ కొడతాడా..?