స్థానిక సమరంలో ప్రచారానికి నేరుగా పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు
TeluguStop.com
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది.ఇది పూర్తయిన వెంటనే ప్రచార పర్వం మొదలవుతుంది.
ఈ ప్రచారంపై ఇప్పటికే ఉమ్మడిగా పోటీ చేస్తున్న బీజేపీ-జనసేన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి.
ఈ తొమ్మిది నెలల కాలంలో అధికార పార్టీ వైఫల్యాల మీద అవిశ్రాంత పోరాటం చేసి ప్రజలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పై ప్రజాభిప్రాయం మారిందని జనసేన పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో అసెంబ్లీ ఫలితాల కంటే కొంత మెరుగైన ఫలితాలు స్థానిక ఎన్నికలలో బీజేపీ-జనసేన సాధిస్తుందని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఉమ్మది ఎన్నికల కార్యాచరణలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారంలోకి దిగుతారని తెలుస్తుంది.
ఎనిమిది జిల్లాల్లో పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేస్తారని, క్యాడర్ ని ఉత్సాహపరచడంతో పాటు మరోసారి ప్రజలకి తన అవసరం ఎంత ఉందో అనే విషయాన్ని గుర్తు చేస్తారని రాజకీయ వర్గాలలో చెప్పుకుంటున్నారు.
ఇక బీజేపీ తరుపున ఈ ప్రచారంలో కేంద్ర మంత్రులు రంగంలోకిదిగుతారని, రెండు పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆయా ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెడతారని తెలుస్తుంది.
ముఖ్యంగా విశాఖతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
మరి జనసేనాని ప్రచారం ఈ మూడో కూటమి ఫలితాలని ఎంత వరకు ప్రభావితం చేస్తాయనేది చూడాలి.
రైలు ప్రయాణంలో టికెట్ లేకున్నా టీటీని బెదిరించిన ప్రయాణికుడు.. (వీడియో)