పవన్ ‘బ్రో’ రెండు రోజులైనా టైమ్ ఇచ్చేనా?

పవన్ కళ్యాణ్ ( Pawan Kalya ) ప్రధాన పాత్ర లో రూపొందిన బ్రో సినిమా ( Bro Movie ) విడుదలకు కేవలం నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది.

ఈ మధ్య కాలంలో సినిమా ల యొక్క ప్రమోషన్‌ కనీసం మూడు నాలుగు వారాలు ఉండాల్సి ఉంది.

కానీ ఇప్పటి వరకు బ్రో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల హడావుడి మొదలు అవ్వలేదు.

మొన్నటి వరకు కూడా సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) పై చిత్రీకరణ చేస్తూనే ఉన్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమా ను భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారు.

ఈ సినిమా కోసం పవన్‌ కళ్యాణ్ దాదాపుగా వంద కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

/br> """/" / ఆ మొత్తాన్ని కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఇవ్వడం జరిగిందట.

కేవలం 20 నుండి 25 రోజులు మాత్రమే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వడం జరిగింది.

ఆ సమయంలోనే షూటింగ్‌ ను ముగించారు.ఇక ప్రమోషన్‌ కార్యక్రమాల సమయంలో మరో రెండు లేదా మూడు రోజుల డేట్లు ఇస్తాను అంటూ పవన్‌ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

కానీ ఇప్పటి వరకు పవన్ ఎప్పుడు వస్తాడు అనే స్పష్టత లేదు.బ్రో సినిమా కోసం పవన్‌ మరో రెండు రోజుల సమయంకేటాయించడం సాధ్యం కాకపోవచ్చు.

"""/" / ఎందుకంటే ఆయన ప్రస్తుతం వారాహి యాత్ర లో ఉన్నాడు.

అంతే కాకుండా ఇతర రాజకీయ పనులతో బిజీగా ఉన్నాడు.భారీ ఎత్తున రూపొందుతున్న ఓజీ సినిమా షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది.

కానీ పవన్ బ్రో సినిమా రెండు రోజుల ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవ్వడం అనుమానమే.

ఒక వేళ పవన్ కళ్యాణ్ కాస్త బ్రో సినిమా ప్రమోషన్ కు హాజరు కాకుంటే పరిస్థితి ఏంటి అంటూ మెగా ఫ్యాన్స్ పాటు సినిమా ను కొనుగోలు చేసిన వారు మాట్లాడుకుంటున్నారు.

ఆ దాడి ఘటనపై సీరియస్ .. నేడు కడపకు పవన్ కళ్యాణ్