‘బ్రో’ ఇంకా స్పీడ్‌ పెంచాలి కదా… ఇలా ఇంకా ఎన్ని రోజులు?

పవన్ కళ్యాణ్‌( Pawan Kalyan ).సాయి ధరమ్ తేజ్ లు ముఖ్య పాత్రల్లో నటించిన బ్రో సినిమా( Bro Movie ) విడుదలకు సిద్దం అయింది.

తమిళ సూపర్‌ హిట్ మూవీ వినోదయ సీతమ్ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బ్రో సినిమా యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలు నీరసంగా సాగుతున్న నేపథ్యం లో పవన్ అభిమానులు.

మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. """/" / ముందు ముందు భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు మంచి పబ్లిసిటీ చేస్తారని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా సినిమా కోసం కొంత స మయం ను కేటాయించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.

అందుకే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌( Pre Release Event ) లో పాల్గొంటాను అంటూ యూనిట్ సభ్యులకు ఇప్పటికే సందేశం ఇచ్చారని తెలుస్తోంది.

ఒక తేదీని నిర్ణయించుకుని పవన్‌ కళ్యాణ్ చెప్తే దాన్ని బట్టి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People's Media Factory ) వారు భావిస్తున్నారట.

ఎంతైనా కూడా సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు ఆశించిన స్థాయి లో జోరుగా సాగడం లేదు అనేది చాలా మంది మాట.

"""/" / భారీ ఎత్తున అంచనాలున్న బ్రో సినిమా యొక్క ఓపెనింగ్స్ భారీగా ఉండాలి అంటే ఇంకా ప్రమోషన్ కార్యక్రమాల విషయం లో స్పీడ్‌ పెంచాలి.

అప్పుడే అంతా బాగుంటుందని అభిమానులు అంటున్నారు.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మరియు ఆయనకు జోడీగా నటించిన కేతిక శర్మ ( Ketika Sharma )మాత్రమే ప్రమోషన్ లో పాల్గొంటున్నారు.

ఆ మధ్య థమన్ బ్రో సినిమా కోసం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

మొత్తానికి బ్రో సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల హడావుడి స్పీడ్‌ అందుకోవాలంటే ఏం చేయాలో పాలుపోక యూనిట్ సభ్యులు తల పట్టుకుని వెయిట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాలేజీ కూడా కంప్లీట్ చేయని మహిళ ప్రతినెలా రూ.15 లక్షలు సంపాదిస్తోంది.. ఎలాగంటే..?